హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు మాత్రం మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని హెచ్చుతగ్గులు మరియు దేశీయ డిమాండ్ ఆధారంగా ఈ ధరల మార్పులు సంభవించాయి. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పసిడి ధరలు స్వల్పంగా దిగిరాగా, వెండి ధరలలోని అసాధారణ పెరుగుదల పెట్టుబడిదారులలో కొంత ఆందోళన కలిగిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతాయి.
Mobile Recharge Price Hike : మరింత పెరగనున్న రీఛార్జ్ ధరలు!
బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల (తులం) బంగారం ధర రూ. 110 తగ్గి, ప్రస్తుతం రూ. 1,30,200 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) పసిడి ధర రూ. 100 మేర పతనమై, రూ. 1,19,350 పలుకుతోంది. ఈ స్వల్ప తగ్గుదల కొనుగోలుదారులకు కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. అయినప్పటికీ, అంతర్జాతీయంగా బంగారంపై ఉన్న పెట్టుబడి ఆసక్తి కారణంగా దీర్ఘకాలంలో ధరలు స్థిరంగా లేదా పెరుగుదల దిశగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Winter Foods: చలికాలంలో ఈ ఆహార పదార్థాలు తింటున్నారా.. అయితే రోగాలకు హాయ్ చెప్పినట్టే!
బంగారంతో పోలిస్తే వెండి ధరలలో భారీ పెరుగుదల కనిపించింది. నేడు కిలో వెండి ధర ఏకంగా రూ. 2,000 మేర పెరిగి, రూ. 2,09,000 మార్కుకు చేరుకుంది. వెండి ధరల పెరుగుదల వేగం గమనార్హం. గత నాలుగు రోజుల్లోనే వెండి ధరలు ఏకంగా రూ. 13,100 మేర పెరగడం మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. పారిశ్రామిక మరియు పెట్టుబడి డిమాండ్ పెరగడం, అంతర్జాతీయంగా వెండి స్టాక్‌ల కొరత వంటి అంశాలు ఈ అసాధారణ పెరుగుదలకు కారణం కావచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
