సామాన్యులకు బంగారం (Gold) కొనడం కలగా మారే స్థితికి బంగారం ధరలు (Gold Price) పెరుగుతున్నాయి. తాజాగా బంగారం ధర ఊహించని రీతిలో పెరిగి ఆల్ టైమ్ రికార్డు(ALL Time Record) స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.700 పెరిగి 10 గ్రాములకు రూ.90,150కి చేరుకుంది. ఇది ఇప్పటివరకు ఎప్పుడు లేని ధరగా చెబుతున్నారు నిపుణులు. ఈ పెరుగుతున్న ధరలు మధ్య తరగతి, దిగువ తరగతి ప్రజలు కొనలేని స్థితికి చేరిందని చెపుతున్నారు.
TTD : తిరుమలలో పనిచేయని సిఫార్సు లేఖలు!
ఇక 24 క్యారెట్ల బంగారం రేటు మరింతగా పెరిగింది. ఒక్కరోజులోనే రూ.770 పెరిగి 10 గ్రాములకు రూ.98,350కి చేరుకుంది. ఇది గడిచిన కాలంలో ఎన్నడూ లేని ధర. పెరుగుతున్న అంతర్జాతీయ మార్కెట్, డాలర్‌తో రూపాయి మారకం, పెట్టుబడిదారుల పోటీ వంటి అంశాలు బంగారం ధరలను బలపరిచినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. నవరత్నాల నుండి సాధారణ గోల్డ్ జువెలరీ వరకూ అన్ని రకాల బంగారం ధరలు ప్రభావితమవుతున్నాయి.
మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. కేజీ వెండి ధర ఒక్కరోజులో రూ.1,000 పెరిగి రూ.1,11,000కి చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్, పెట్టుబడుల రక్షణ కోసం బంగారంపై ఆధారపడే భారతీయులు, ఇప్పుడు ఒక్క గ్రాము కొనడానికే వెనుకాడే పరిస్థితికి చేరుకున్నారు. ఈ ధరలు ఇంకా పెరగవచ్చని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.