. టెక్నాలజీ, ఇంజనీరింగ్‌కు అంతర్జాతీయ వేదిక
. వ్యూహాత్మక భాగస్వామ్యంతో భవిష్యత్ దిశగా
. ఆధునిక AI మరియు ప్లాట్ ఫాం ఆపరేటింగ్ మోడల్
Global Capability Center : ప్రపంచవ్యాప్తంగా డబ్బు బదిలీల రంగంలో అగ్రగామిగా నిలిచిన ద వెస్ట్రన్ యూనియన్ కంపెనీ (NYSE WU) ప్రముఖ టెక్నాలజీ సంస్థ HCLTech సహకారంతో హైదరాబాద్‌లో తమ గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ (GCC) ను అధికారికంగా ప్రారంభించింది. ఈ ఆధునిక కేంద్రం వెస్ట్రన్ యూనియన్ డిజిటల్ పరివర్తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడమే కాకుండా AI ఆధారిత ఆవిష్కరణలు ప్లాట్‌ఫాం ఆపరేటింగ్ మోడల్ మరియు ఇంజనీరింగ్ ఎక్సలెన్స్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లేలా రూపకల్పన చేయబడింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెస్ట్రన్ యూనియన్ ప్రెసిడెంట్ మరియు CEO డెవిన్ మెక్‌గ్రనహన్ HCLTech CEO, మేనేజింగ్ డైరెక్టర్ సి. విజయకుమార్‌తో పాటు రెండు సంస్థల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో వెస్ట్రన్ యూనియన్ విస్తరణకు ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.
పూణెలో ఉన్న టెక్ సెంటర్‌తో కలిసి హైదరాబాద్ GCC టెక్నాలజీ ఇంజనీరింగ్ మరియు ఆపరేషన్స్ కోసం ఒక గ్లోబల్ హబ్‌గా పని చేయనుంది. ఈ కేంద్రం ద్వారా ఆధునిక చెల్లింపుల మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ వినియోగదారుల అనుభవాల మెరుగుదల మరియు ప్రపంచ స్థాయిలో అవసరమైన టెక్నాలజీ సామర్థ్యాల నిర్మాణం జరుగుతుంది. HCLTech అందించే AI Force™ వంటి AI-పవర్డ్ పరిష్కారాలను వినియోగిస్తూ ఈ కేంద్రం సురక్షితమైన వేగవంతమైన మరియు స్కేలబుల్ డిజిటల్ సేవలను అభివృద్ధి చేయనుంది. తద్వారా వెస్ట్రన్ యూనియన్ తన కస్టమర్లకు చెల్లింపులకు మించిన విలువైన సేవలను అందించగలుగుతుంది. ఈ సందర్భంగా డెవిన్ మెక్‌గ్రనహన్ మాట్లాడుతూ..హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ వెస్ట్రన్ యూనియన్ పరివర్తనా ప్రయాణంలో ఒక కీలక ఘట్టం. HCLTechతో మా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా మేము లోతైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ఆధునిక AI సామర్థ్యాలతో మిళితం చేస్తున్నాం.
దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కస్టమర్లకు సజావుగా సురక్షితంగా మరియు వినూత్నమైన అనుభవాలను అందించగలుగుతాము అని తెలిపారు. HCLTech CEO, MD సి. విజయకుమార్ మాట్లాడుతూ..వెస్ట్రన్ యూనియన్‌తో మా భాగస్వామ్యంలో ఈ GCC ఒక కీలక ముందడుగు. ఇది ఆర్థిక సేవలు మరియు గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ల కోసం వ్యాపార–టెక్నాలజీ పరివర్తనను వేగవంతం చేసే మా డిజిటల్ క్లౌడ్ మరియు AI శక్తిని ప్రతిబింబిస్తుంది. వెస్ట్రన్ యూనియన్ ‘బియాండ్’ వ్యూహానికి అనుగుణంగా కొలవదగిన ఫలితాలు అందించడం డిజిటల్-ఫస్ట్ వ్యాపార మోడల్‌ను అభివృద్ధి చేయడం మరియు ఆధునిక తరం చెల్లింపుల మౌలిక సదుపాయాలను నవీకరించడంపై మేము దృష్టి పెట్టాం అన్నారు. ఈ GCC ద్వారా హైదరాబాద్ మరోసారి గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటూ భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు కీలక పాత్ర పోషించనుంది.
