Gensol Fraud Scandal: సోలార్ ఎనర్జీ సేవల కంపెనీ జెన్సోల్ (బ్లూస్మార్ట్)పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తును మొదలుపెట్టింది. రూ.975 కోట్ల రుణాలను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలను ఈ కంపెనీ ఎదుర్కొంటోంది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ (MCA) జెన్సోల్ ఎలక్ట్రిక్‌పై సుమోటోగా విచారణను ప్రారంభించింది. దర్యాప్తులో బయటికొచ్చే లోపాల ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ప్రముఖుల జాబితాలో స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె, సంజీవ్ బజాజ్, అష్నీర్ గ్రోవర్ ఉన్నారు. జెన్సోల్ (బ్లూస్మార్ట్) కంపెనీలో స్టార్ క్రికెట్ ధోనీ దాదాపు రూ.400 కోట్లు ఈ ఏడాది మొదట్లోనే పెట్టుబడులు పెట్టారని సమాచారం. ఈ కంపెనీని ప్రారంభించిన (2017) తర్వాతి ఏడాదిలోనే దీపికా పదుకునే షేర్లు కొన్నట్టు తెలుస్తోంది. 2019లో 3 మిలియన్ల డాలర్ల పెట్టుబడి కోసం ఏంజెల్ ఫండింగ్ రౌండ్‌లో జెన్సోల్ (బ్లూస్మార్ట్) పాల్గొంది. దీని ద్వారా దీపిక, బజాజ్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్, JITO ఏంజెల్ నెట్‌వాక్, రజత్ గుప్తాతో కలిసి 3 మిలియన్ డాలర్ల దాకా పెట్టుబడిని జెన్సోల్‌కు అందించారు. 2024 సంవత్సరంలో ఈ కంపెనీ ప్రీ-సిరీస్ బీ ఫండింగ్ రౌండ్‌లో 24 మిలియన్ డాలర్లను సేకరించింది. ఈ రౌండ్‌లోనే క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, భారత్‌పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ పెట్టుబడులు పెట్టారు.
Also Read :Auto Driver To Billionaire : నాడు ఆటో డ్రైవర్.. నేడు బిలియనీర్.. రూ.800 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
రూ.4,100 కోట్లకుపైగా నిధులతో..
ఎలక్ట్రిక్ వాహనాలతో క్యాబ్ సర్వీసులను నడుపుతామంటూ బ్లూస్మార్ట్ కంపెనీని బెంగళూరు(Gensol Fraud Scandal) కేంద్రంగా స్థాపించారు.ఈ సంస్థ కో ఫౌండర్ ఎవరంటే జెన్సోల్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు అన్మోల్ జగ్గీ. జెన్సోల్ కంపెనీయే బ్లూస్మార్ట్ క్యాబ్స్ సంస్థ కోసం ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు కోసం రూ.4,100 కోట్లకుపైగా నిధులను సమీకరించింది. ఎలక్ట్రిక్ కార్లతో వాహన సర్వీసులను నడిపి.. ఉబర్, ఓలాలకు పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో బ్లూస్మార్ట్ సేవలు 2018 సంవత్సరంలో మొదలయ్యాయి. బ్లూస్మార్ట్ పేరుతో ప్రత్యేక క్యాబ్స్ యాప్‌ను లాంఛ్ చేశారు. అయితే దీనికి అంతగా జనాదరణ లభించలేదు. ఈనేపథ్యంలో ఏప్రిల్ 15న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కీలక ప్రకటన చేసింది. ‘‘బ్లూస్మార్ట్ స్టార్టప్ ప్రమోటర్లైన జెన్సోల్ ఇంజనీరింగ్ అధిపతులు అన్మోల్, పునీత్ సింగ్ జగ్గీ బ్లూస్మార్ట్ కోసం కార్లు కొనడానికి ఉద్దేశించిన రుణాలను గురుగ్రామ్‌లోని DLF ది కామెలియాస్‌లోని లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలుకు వాడారు. రుణంలోని మరో రూ. 26 లక్షలతో హై-ఎండ్ గోల్ఫ్ పరికరాలు కొన్నారు. ఈవిషయాన్ని మేం గుర్తించాం’’ అని సెబీ వెల్లడించింది. ఈ కారణం వల్ల జగ్గీ సోదరులు జెన్సోల్ (బ్లూ స్మార్ట్) కంపెనీలో డైరెక్టర్ పదవులను నిర్వహించకుండా సెబీ బ్యాన్ విధించింది. ఆ వెంటనే ఏప్రిల్ 17న బ్లూస్మార్ట్ కంపెనీ తమ కస్టమర్లకు ఒక ఈమెయిల్‌ను పంపింది. ‘‘బ్లూస్మార్ట్ యాప్‌లో బుకింగ్‌లను మూసివేయాలని నిర్ణయించాం’’ అని అందులో తెలిపింది.
Also Read :Thackerays Reunion: ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే కలవబోతున్నారా ? ఇరుపార్టీల విలీనమా ?
రూ.262.13 కోట్లకు లెక్క తేలలేదు
జెన్సోల్ ఇంజనీరింగ్ (బ్లూస్మార్ట్) కంపెనీకి ఐఆర్‌ఈడీఏ(IREDA), పీఎఫ్‌సీ(PFC) నుంచి రూ.977.75 కోట్ల లోన్ లభించింది. ఇందులో రూ.567.74 కోట్లతో 4,704 ఈవీలను కొన్నారు. మిగతా రూ.262.13 కోట్లను వ్యక్తిగత పెట్టుబడుల కోసం జెన్సోల్ ఇంజనీరింగ్ అధిపతులు అన్మోల్, పునీత్ సింగ్ జగ్గీ వాడుకున్నారని సెబీ తేల్చింది.