Gautam Adani : గౌతం అదానీ శాలరీ.. వాళ్ల కంటే తక్కువేనట!

గౌతమ్‌ అదానీ.. గత పదేళ్లలో మన దేశంలో అత్యంత వేగంగా ఎదిగిన పారిశ్రామికవేత్త. 

  • Written By:
  • Updated On - June 23, 2024 / 04:28 PM IST

Gautam Adani : గౌతమ్‌ అదానీ.. గత పదేళ్లలో మన దేశంలో అత్యంత వేగంగా ఎదిగిన పారిశ్రామికవేత్త.  ఈయన వ్యాపారాలు శరవేగంగా ఎన్నో రంగాలకు విస్తరించాయి. అటువంటి శ్రీమంతుడైన గౌతమ్ అదానీ 2023 -2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక వేతనం ఎంత తీసుకున్నారో తెలుసా ?  ఆయన తీసుకున్న వార్షిక వేతనం అనేది.. అదానీ గ్రూపులో పనిచేసే చాలామంది ఉన్నతాధికారుల వేతనాల కంటే చాలా తక్కువట. అది ఎంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ తాజాగా దాని వార్షిక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గౌతమ్‌ అదానీ రూ.2.19 కోట్ల వార్షిక వేతనం తీసుకున్నారు. ఇతర అలవెన్సులు, ప్రయోజనాల రూపంలో మరో రూ.27లక్షలు గౌతమ్ అదానీకి కంపెనీ నుంచి అందాయి. అంతకుముందు సంవత్సరం(2022-23)తో పోలిస్తే ఈసారి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నుంచి గౌతమ్ అదానీకి 3శాతం ఎక్కువ  వేతనం వచ్చింది. మరో కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌ నుంచి రూ.6.8 కోట్ల శాలరీని 2023-24 ఆర్థిక సంవత్సరంలో గౌతమ్ అదానీ అందుకున్నారు. ఇవన్నీ కలుపుకుంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో గౌతం అదానీకి రూ.9.26 కోట్ల శాలరీ వచ్చింది.  అదానీ గ్రూపునకు చెందిన 10 లిస్టెడ్‌ కంపెనీలు వార్షిక నివేదికలు ఇవ్వగా.. కేవలం అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నుంచే గౌతం అదానీ శాలరీలు తీసుకున్నారు. అయితే ఈ శాలరీ అనేది తన సహచర పారిశ్రామికవేత్తలతోపాటు సొంత కంపెనీల్లో పనిచేసే అత్యున్నత సిబ్బంది కంటే తక్కువే కావడం గమనార్హం. ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రమణ్యన్‌, ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ల కంటే గౌతం అదానీ(Gautam Adani)  వార్షిక వేతనం తక్కువ కావడం గమనార్హం. అదానీ సంపద విలువ 106 బిలియన్‌ డాలర్లు. సంపద విషయంలో అంబానీతో పోటీపడుతున్న ఆయన ఒకానొక సమయంలో (2022లో) ఆసియాలోనే సంపన్న వ్యక్తిగానూ నిలిచారు.

Also Read :CBI – NEET : ‘నీట్‌’ వ్యవహారంపై సీబీఐ ఎఫ్‌ఐఆర్.. గుజరాత్, బిహార్‌కు టీమ్స్

  • దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్‌ అంబానీ వార్షిక వేతనం రూ.15కోట్లుగా ఉండేది.
  • భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత సునీల్‌ మిత్తల్‌ (2022-23లో రూ.16.7కోట్లు) వార్షిక వేతనం తీసుకున్నారు.
  •  రాజీవ్‌ బజాజ్‌ (రూ.53.7కోట్లు), పవన్‌ ముంజాల్ (రూ.80 కోట్లు) వార్షిక వేతనాలు తీసుకున్నారు.
  • ఏఈఎల్‌ నుంచి అదానీ సోదరుడు రాజేశ్‌ మొత్తంగా రూ.8.37 కోట్లు పొందగా (రూ.4.71కోట్లు కమీషన్‌తో కలిపి).. ఆయన మేనల్లుడు ప్రణవ్‌ అదానీ రూ.6.46కోట్లు అందుకున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.

Also Read :CM Chandrababu : సీఎం చంద్రబాబు కొత్త సంప్రదాయం.. ఇక నుంచి ప్రతీ శనివారం..!