Flipkart Platform Fee: ఇతర డెలివరీ యాప్‌ల తరహాలోనే ఫ్లిప్‌కార్ట్ కూడా రూ. 3 ప్లాట్‌ఫామ్ ఫీజు (Flipkart Platform Fee) వసూలు చేయడం ప్రారంభించింది. సంస్థకు చెందిన మింత్రా, ఫ్లిప్‌కార్ట్స్ మినిట్స్‌లోనూ వసూలు మొదలైంది. తమ సంస్థ అందించే సేవలు మరింత మెరుగ్గా కొనసాగేందుకు ఈ ఫీజు తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో సంస్థ వెల్లడించింది. కాగా, జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటివి ఇప్పటికే ప్లాట్‌ఫామ్ ఫీజును కలెక్ట్ చేస్తున్నాయి.
ఆన్‌లైన్ ప్రొడక్ట్‌లకు నమ్మకమైన డెలివరీ సంస్థగా పేరొందింది ఫ్లిప్‌కార్ట్. ఏళ్ల తరబడి ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలో సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. తొలి నాళ్ల నుంచి ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్ ఎదిగిన తీరు చూస్తే ఔరా అనిపిస్తుంటుంది. మనకు ఏ వస్తవు కావాలన్న ఇంట్లో కూర్చొని మనకు నచ్చిన వస్తువును ఆర్డర్ చేసుకుకునే వెసులుబాటును ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తుంది. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ యూజర్లకు బిగ్ షాక్ ఇవ్వనుంది.
Also Read: Elon Musk’s X: బ్రెజిల్‌లో ట్విట్టర్ మూసివేత.. రీజన్ ఇదేనా..?
ఫ్లిప్‌కార్ట్ కూడా కొన్ని ఆన్ లైన్ సంస్థల వలె ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేసేందుకు కంకణం కట్టుకుంది. ఇలా చేస్తే ఫ్లిప్‌కార్ట్ ఆదాయం పెరగటంతో పాటు వినియోగదారులపై అదనపు భారం పెరగనుంది. ఇందుకోసమే కంపెనీ ఇకపై ప్రతి ఆర్డర్‌పై రూ. 3 ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్లాట్‌ఫామ్ ఫీజు విషయంలో ఫ్లిప్‌కార్ట్ కంటే ముందే కొన్ని సంస్థలు వసూలు చేస్తున్నాయి. ఆయా ప్రొడక్ట్ కాస్ట్‌ను బట్టి వసూలు చేశాయి. ఈ విభాగంలో స్విగ్గీ, జొమాటో, బ్లింక్ఇట్, జెప్టో ప్రముఖ కంపెనీలు ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ సంస్థల సరసన ఫ్లిప్‌కార్ట్ కూడా చేరింది. అయితే ఒకవేళ ఫ్లిప్‌కార్ట్ రూ. 3 కంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే వినియోగదారులపై భారం పెరగటం ఖాయం. అదే విధంగా ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మరీ దీనిపై కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
We’re now on WhatsApp. Click to Join.