Site icon HashtagU Telugu

Fight At Apple Store : ఐఫోన్ 17 కోసం స్టోర్ల వద్ద కొట్లాట .ఏంటి సామీ ఈ పిచ్చి

Fight At Mumbai Apple Store

Fight At Mumbai Apple Store

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని యాపిల్ స్టోర్ (Apple Store) వద్ద ఐఫోన్ 17 (Iphone 17)అమ్మకాలు ప్రారంభమైన వెంటనే గందరగోళం నెలకొంది. కొత్త ఐఫోన్ కోసం భారీ క్యూలు ఏర్పడగా, కొంతమంది కస్టమర్లు క్యూలను చెరిపేయడంతో గొడవలు తలెత్తాయి. ఒక దశలో అక్కడే కొందరు ఒకరిని ఒకరు తోసుకుంటూ, కొట్టుకునే స్థితి వచ్చింది. ఈ క్రమంలో ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది లాగి బయటకు తీసుకువచ్చారు. కానీ అతను కూడా సెక్యూరిటీ సిబ్బందిపైనే దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.

సెక్యూరిటీ సిబ్బంది నియంత్రణలో విఫలమవ్వడంతో కొంతసేపు గందరగోళం కొనసాగింది. మరో వ్యక్తిని కూడా జనసందోహం మధ్యనుండి భద్రతా బలగాలు బయటకు లాగాయి. దీనిపై కొనుగోలుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ నుంచి వచ్చిన మోహన్ యాదవ్ మాట్లాడుతూ .. “నేను ఉదయం 5 గంటలకే వచ్చి క్యూలో నిలబడ్డాను. కానీ సెక్యూరిటీ సిబ్బంది ఎలాంటి బాధ్యత చూపించడం లేదు. చాలా మంది క్యూలను చెరిపి ముందుకు దూసుకుపోతున్నారు. దీంతో వెనుక నిలబడిన వారికి అవకాశం రావడం లేదు” అని ఆరోపించారు.

Indian Techie Dead: అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి!

ముంబైలో ఇలా గొడవలు జరిగితే, ఢిల్లీలోని సాకేత్ సెలెక్ట్ సిటీ వాక్ మాల్ వద్ద కూడా ఐఫోన్ 17 కోసం రాత్రంతా కస్టమర్లు క్యూలో నిలబడ్డారు. ఉదయం మాల్ తెరవగానే కొనుగోలు కోసం ఎగబడ్డారు. బెంగళూరులోనూ భారీగా క్యూలు కనిపించినప్పటికీ, అక్కడ పరిస్థితి కొంత నియంత్రణలోనే ఉందని సమాచారం. ఈసారి యాపిల్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్, అలాగే కొత్తగా ఐఫోన్ ఎయిర్ మోడళ్లను విడుదల చేసింది. వీటి ధరలు రూ.82,900 నుంచి రూ.2.3 లక్షల వరకు ఉండటంతో టెక్ ప్రియులు, ఫ్యాషన్ అభిమానం ఉన్నవారు అధిక సంఖ్యలో స్టోర్లకు తరలివచ్చారు.

Exit mobile version