Fake Toothpastes : ఎంతకూ తెగించార్రా.. Colgate పేరుతో నకిలీ టూత్ పేస్టులు

Fake Toothpastes : దేశవ్యాప్తంగా నకిలీ ఉత్పత్తులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటిదాకా కల్తీ పాలు, అల్లం పేస్టులు, నూనె ప్యాకెట్లు బయటపడగా, తాజాగా నకిలీ టూత్‌పేస్టులు బయటపడటం సంచలనంగా మారింది.

Published By: HashtagU Telugu Desk
Fake Colgate Toothpaste In

Fake Colgate Toothpaste In

దేశవ్యాప్తంగా నకిలీ ఉత్పత్తులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటిదాకా కల్తీ పాలు, అల్లం పేస్టులు, నూనె ప్యాకెట్లు బయటపడగా, తాజాగా నకిలీ టూత్‌పేస్టులు బయటపడటం సంచలనంగా మారింది. గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ బ్రాండ్ ‘Colgate’ పేరుతో తయారుచేసిన నకిలీ టూత్‌పేస్ట్ బాక్స్‌లు పెద్ద ఎత్తున స్వాధీనం అయ్యాయి. చిత్రోడ్ ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించి ఈ ఫేక్ ఉత్పత్తులను పట్టుకున్నారు. ఈ దాడుల్లో సుమారు రూ.9.43 లక్షల విలువైన సరకును పోలీసులు సీజ్ చేశారు.

Pawan Singh: రాబోయే ఎన్నికలలో పోటీ చేయనని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌!

ప్రాథమిక దర్యాప్తులో ఈ నకిలీ టూత్‌పేస్టులు స్థానిక మార్కెట్‌లో మాత్రమే కాకుండా, పొరుగుని జిల్లాలకు, కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతున్నట్లు బయటపడింది. అసలు Colgate ప్యాకేజింగ్‌లకు దగ్గరగా ఉండే విధంగా నకిలీ ప్యాకెట్లు, సీలింగ్‌లు, లేబుళ్లు తయారుచేసి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కల్తీ ఉత్పత్తులు వినియోగించడం ఆరోగ్యానికి తీవ్రమైన హానిని కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయన పరీక్షల కోసం నమూనాలను ల్యాబ్‌కి పంపినట్లు పోలీసులు తెలిపారు.

ఇక, ఈ నకిలీ ఉత్పత్తుల వెనుక ఉన్న సప్లై చైన్‌ను తెలుసుకునేందుకు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, వాటికి ముడి సరుకులు ఎక్కడినుంచి వస్తున్నాయి అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఫేక్ బ్రాండ్ ఉత్పత్తులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వినియోగదారులు కూడా బ్రాండ్ ఉత్పత్తులు కొనుగోలు చేసే ముందు ప్యాకేజింగ్, సీల్, QR కోడ్ వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

  Last Updated: 11 Oct 2025, 12:56 PM IST