PF Withdraw: కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్‌వో నిబంధనలను మార్చింది. ఇప్పుడు పీఎఫ్ విత్ డ్రా (PF Withdraw) పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. డిజిటల్ నిర్మాణాన్ని మరింత సులభం, జవాబుదారీగా చేయడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కొన్ని ప్రమాణాలను మార్చడం ద్వారా నిబంధనలను మార్చింది. ఈ మార్పు తర్వాత ఏ PF కస్టమర్ అయినా తన ఖాతా నుండి ఒకేసారి రూ. 1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ మార్పు గురించి సమాచారం ఇస్తూ కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా.. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.
PF నుండి ఉపసంహరణకు సేవా పరిమితి తొలగింపు
PF ఖాతాల నుండి విత్‌డ్రా చేయడానికి సేవా పరిమితి అంటే ఉద్యోగ వ్యవధికి సంబంధించిన పరిమితిని కూడా తొలగించినట్లు కార్మిక మంత్రి తెలిపారు. ఇంతకుముందు కొత్త PF ఖాతా క్రింద 6 నెలల కంటే తక్కువ చందా చేసిన ఉద్యోగులు డబ్బును తీసుకోలేరు. దీంతో కొత్తగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు నష్టపోయారు. ఇప్పుడు అలాంటి ఉద్యోగులు కూడా పీఎఫ్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
Also Read: New Kia Carnival: లాంచ్‌కు ముందే కియా కార్నివాల్ రికార్డు.. 24 గంటల్లోనే 1822 ప్రీ ఆర్డర్‌లు..!
ఉద్యోగులకు పీఎఫ్ విత్‌డ్రా పరిమితిని పెంచే బహుమతిని ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందో కూడా కార్మిక మంత్రి వెల్లడించారు. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సదుపాయం ప్రారంభించబడింది. దీనివల్ల వివాహం లేదా వైద్య చికిత్స కోసం EPFO పొదుపు నుండి డబ్బును ఉపసంహరించుకునే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. పాత కాలంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో ప్రజల అవసరాలు, ఖర్చులు పెరగడంతో విత్‌డ్రా పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
1.5 కోట్ల మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు లబ్ది
ప్రస్తుతం ఈపీఎఫ్‌వో ఖాతాలు కలిగి ఉన్న 1.65 కోట్ల మంది ప్రజలు పీఎఫ్ విత్‌డ్రా పరిమితిని పెంచడం వల్ల ప్రయోజనం పొందనున్నారు. EPFO 1 కోటి మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులకు పదవీ విరమణ నిధిని అందిస్తుంది. EPFO ఖాతాలో జమ చేసిన మొత్తంపై ప్రతి సంవత్సరం 8.25% పొదుపు వడ్డీ రేటు ఇవ్వబడుతుంది.