ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

Gold  రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఈ వారం భారీ పతనాన్ని చవిచూశాయి. డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామంతో శుక్రవారం ఒక్కరోజే ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ 9 శాతం పడిపోగా, సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 25 శాతం మేర నష్టపోయింది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర రూ. 1,49,075 వద్ద ఉండగా, కిలో […]

Published By: HashtagU Telugu Desk
Gold- Silver Prices

Gold- Silver Prices

Gold  రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఈ వారం భారీ పతనాన్ని చవిచూశాయి. డాలర్ బలపడటం, ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ పరిణామంతో శుక్రవారం ఒక్కరోజే ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ ఫ్యూచర్స్ 9 శాతం పడిపోగా, సిల్వర్ ఫ్యూచర్స్ ఏకంగా 25 శాతం మేర నష్టపోయింది.

ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర రూ. 1,49,075 వద్ద ఉండగా, కిలో వెండి ఫ్యూచర్స్ ధర రూ. 2,91,922 వద్ద ట్రేడవుతోంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) లెక్కల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గత ముగింపు ధర రూ. 1,75,340 నుంచి రూ. 1,65,795కి తగ్గింది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేయడంతో డాలర్ విలువ పుంజుకుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు వార్ష్ కఠిన వైఖరితో ఉంటారని, వడ్డీ రేట్ల పెంపును సమర్థిస్తారనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో డాలర్ బలపడి, బంగారం, వెండి వంటి విలువైన లోహాలలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

అయితే, మార్కెట్ విశ్లేషకులు దీనిని ‘హెల్తీ కరెక్షన్’గా అభివర్ణిస్తున్నారు. ఇది తాత్కాలికమేనని, దీర్ఘకాలికంగా మార్కెట్ బలహీనపడినట్లు కాదని స్పష్టం చేశారు. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారం కొనుగోలు చేస్తుండటం, అలాగే గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ, ఎలక్ట్రానిక్స్ రంగాల నుంచి వెండికి భారీగా పారిశ్రామిక డిమాండ్ ఉండటం వంటి అంశాలు భవిష్యత్తులో ధరలకు మద్దతు ఇస్తాయని వారు పేర్కొంటున్నారు. వెండి ధర రూ. 3 లక్షల నుంచి రూ. 3.10 లక్షల స్థాయికి పడిపోతే, మళ్లీ కొనుగోళ్ల ఆసక్తి పెరిగి రూ. 3,40,000 నుంచి రూ. 3,50,000 స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

  Last Updated: 31 Jan 2026, 12:42 PM IST