Budget: బడ్జెట్‌లో కేటాయించే డబ్బు కేంద్రానికి ఎక్కడి నుండి వస్తుందో తెలుసా?

మోదీ ప్రభుత్వం మూడో దఫా తొలి బడ్జెట్‌ (Budget)ను ప్రవేశపెట్టింది.

  • Written By:
  • Updated On - July 23, 2024 / 11:30 PM IST

Budget: మోదీ ప్రభుత్వం మూడో దఫా తొలి బడ్జెట్‌ (Budget)ను ప్రవేశపెట్టింది. మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం నుండి సంక్షేమ పథకాల వరకు ప్రతిదానికీ ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించే డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ప్రభుత్వం సేకరించే ప్రతి రూపాయిలో ఎక్కువ భాగం ప్రభుత్వం మార్కెట్ నుండి సేకరించే రుణం ద్వారానే వస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రెండవ స్థానంలో ఆదాయపు పన్ను ఉంది. ఇది కార్పొరేట్ పన్ను కంటే ఎక్కువ.

ప్రభుత్వం ఎక్కడి నుంచి నిధులు సమకూరుస్తుంది?

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రస్తుత సంవత్సరంలో ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రస్తుత సంవత్సరంలో ఒక రూపాయి ఖర్చు చేయడానికి ప్రభుత్వం ఆ ఒక్క రూపాయి నుండి 27 పైసలు అప్పుగా తీసుకుంటుంది. ఆదాయపు పన్ను వసూళ్లు ద్వారా 19 పైసలు వస్తాయి. జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా ప్రభుత్వం 18 పైసలు వ‌స్తాయి. కార్పొరేషన్ పన్ను ద్వారా 17 పైసలు వస్తాయి. నాన్-టాక్స్ రసీదు, 5 పైసల సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, 4 పైసల కస్టమ్ డ్యూటీ, 1 పైసా నాన్-డెట్ క్యాపిటల్ రసీదు ద్వారా 9 పైసలు వ‌స్తాయి.

Also Read: Population Census: ఈ ఏడాది కూడా జనాభా లెక్కింపు లేనట్లేనా?, బడ్జెట్‌లో పైసల్ లేవుగా

ప్రభుత్వం ఎక్కడ ఖర్చు చేస్తుంది..?

పన్నులు, ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వం వసూలు చేస్తున్న డబ్బును ఎక్కడ ఖర్చు పెడుతుందనే ప్రశ్న పౌరుల మదిలో మెదులుతూనే ఉంది. కాబట్టి ప్రభుత్వం పొందే ఒక రూపాయిలో ప్రభుత్వం రాష్ట్రాలకు వారి పన్నులు, సుంకాలలో వాటాగా 21 పైసలను ఇస్తుంది. దీని తరువాత తీసుకున్న రుణంపై వడ్డీ చెల్లించడానికి ప్రభుత్వం తన డబ్బులో ఎక్కువ భాగం ఖర్చు చేస్తుంది. ఈ ఏడాది ప్రభుత్వం ప్రతి రూపాయికి వడ్డీ చెల్లింపుపై 19 పైసలు ఖర్చు చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రభుత్వం సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌లకు అంటే రక్షణ, సబ్సిడీ ఖర్చులను చేర్చని దాని పథకాలపై 16 పైసలు ఖర్చు చేస్తుంది. ప్రభుత్వం రక్షణ కోసం 8 పైసలు, కేంద్ర ప్రాయోజిత పథకాలపై 8 పైసలు, ఫైనాన్స్ కమిషన్, ఇతర బదిలీలపై 9 పైసలు, సబ్సిడీపై 6 పైసలు, పెన్షన్‌పై 4 పైసలు, ఇతర రకాల ఖర్చులపై 9 పైసలు ఖర్చు చేస్తుంది.

14.01 లక్షల కోట్ల రుణాన్ని ప్రభుత్వం తీసుకోనుంది

ప్రభుత్వం తన ఆదాయంలో అధిక భాగాన్ని రుణ వడ్డీ చెల్లింపుకే వెచ్చించాల్సి వస్తోందని ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వం మొత్తం రూ.48.21 లక్షల కోట్లు ఖర్చు చేయబోతుండగా, అందులో రూ.25.83 లక్షల కోట్లు పన్నుల ద్వారా సమీకరించనుంది. ఖర్చు, ఆదాయాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రభుత్వం రూ.14.01 లక్షల కోట్ల రుణాన్ని తీసుకుంటుంది.

Follow us