Billionaires Free Time : వాళ్లు శ్రీమంతులు, అపర కుబేరులు. ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్న వాళ్లంటే ఏకంగా ప్రభుత్వాధినేతలకు కూడా గౌరవభావం ఉంటుంది. ముకేశ్ అంబానీ, ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్ లాంటి అపర కుబేరులు(Billionaires Free Time) కలుస్తామంటే.. ఏ ప్రభుత్వాధినేత కూడా వద్దని చెప్పరు. వాళ్లు ఆ రేంజులో వ్యాపార ప్రపంచంలో సక్సెస్ అయ్యారు. ఏకంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా తయారయ్యేలా వ్యాపారాలను బలంగా నిలిపారు. ఆయా దేశాలే గర్వించే స్థాయికి తమను తాము చేర్చుకున్నారు. ఇంతకీ ఈ అపర కుబేరులు తీరిక దొరికినప్పుడు ఏం చేస్తుంటారు అనేది ఈ కథనంలో చూద్దాం..
Also Read :Weekly Horoscope : ఆ రాశుల వాళ్లకు అప్పులు తీరుతాయ్.. ఈరోజు నుంచి డిసెంబరు 21 వరకు వీక్లీ రాశిఫలాలు
ముకేశ్ అంబానీ
- ముకేశ్ అంబానీకి క్రికెట్ అంటే ఇష్టం. మ్యాచ్‌లు జరుగుతుంటే ఆయన స్కోరు వివరాలను తెలుసుకుంటుంటారు. కార్లకు సంబంధించిన మ్యాగజైన్లను చదువుతుంటారు. కొత్త మోడళ్ల కార్ల గురించి తెలుసుకోవడం అంటే ముకేశ్‌కు ఇంట్రెస్ట్. ఇలా చదివే క్రమంలో ఏదైనా కారు నచ్చితే.. దాని కోసం ఆయన ఆర్డర్ ఇచ్చేస్తుంటారు. ముకేశ్ అంబానీ గ్యారేజీలో ఇప్పటికే వందలాది కార్లు ఉన్నాయి. లీజర్ టైంలో మ్యూజిక్ వినడం, మూవీస్ చూడటం అంటే ఆయనకు ఇష్టం.
వారెన్ బఫెట్
- అమెరికా సంపన్నుడు వారెన్ బఫెట్ లీజర్ టైంలో బ్రిడ్జ్ గేమ్ ఆడుతారట. దీనివల్ల తన మెదడు యాక్టివేట్ అవుతుందని ఆయన అంటారు. కాసేపు ఇంటి గార్డెన్‌లో వాకింగ్ చేస్తానని బఫెట్ చెబుతుంటారు. వారంలో ఒకసారి ఎప్పుడైనా టైం దొరికితే గోల్ఫ్ క్లబ్‌కు వెళ్లి గడుపుతారు. గోల్ఫ్ ఆడుతారు. గిటార్ లాగే ఉండే యూకాలేలీని వాయిస్తూ టైం పాస్ చేస్తుంటారు బఫెట్.
మార్క్ జుకర్‌బర్గ్
- ఫేస్ బుక్ (మెటా) అధినేత, అమెరికాకు చెందిన మార్క్ జుకర్ బర్గ్‌కు ఒక పశువుల ఫామ్ ఉంది. లీజర్ దొరికినప్పుడు అక్కడికి ఆయన వెళ్తారు. కాసేపు అక్కడున్న పశువులతో జుకర్ బర్గ్ గడుపుతారు. ఆయన దగ్గరున్న కొన్ని పశువులు బీర్ కూడా తాగుతుంటాయట. టైం దొరికినప్పుడు ఇంట్లోనే జు జిట్సును ప్రాక్టీస్ చేస్తుంటారు.
Also Read :Room Freshener : మీ ఇల్లు క్షణాల్లో మంచి వాసన రావడం ప్రారంభమవుతుంది, ఈ రూమ్ ఫ్రెషనర్ ఒత్తిడిని తగ్గిస్తుంది..!
ఎలాన్ మస్క్
- ట్విట్టర్ (ఎక్స్) యజమాని, అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ లీజర్ టైంలో వీడియో గేమ్స్ ఆడుతుంటారు. సంగీతం వింటారు. వీటన్నింటికి మించి పుస్తకాలు చదువుతుంటారు. ‘బెంజమిన్ ఫ్రాంక్లిన్’ జీవిత చరిత్ర పుస్తకం అంటే తనకెంతో ఇష్టమని మస్క్ చెబుతుంటారు. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆ బుక్ చదువుతానని ఆయన అంటారు.
జెఫ్ బెజోస్
- అమెజాన్ అధినేత, అమెరికాకు చెందిన జెఫ్ బెజోస్ లీజర్ టైంలో సముద్ర తీరాల్లో విహరించేందుకు ప్రయారిటీ ఇస్తుంటారు. గుర్రపు స్వారీ చేయడం అంటే ఆయనకు బాగా ఇష్టమట. గుర్రంపై వేగంగా రైడ్ చేయడం అంటే తనకు ఎంతో ఆసక్తి అని బెజోస్ అంటారు. బెజోస్ ఒక గుర్రాల ఫామ్ ఉంది. అందులో రకరకాల జాతులకు చెందిన వందలాది గుర్రాలను పెంచుతున్నారు. సైన్స్ ఫిక్షన్ సిరీస్‌లు చూసి అందులోని పాత్రలను బెజోస్ డ్రా చేస్తుంటారట.