Site icon HashtagU Telugu

Zomato Delete Order Feature : జొమాటోలో డిలీట్ ఆర్డ‌ర్ ఆప్ష‌న్‌.. దీంతో ఏం లాభమో మీకు తెలుసా..?

Zomato Delete Order Feature

Zomato Delete Order Feature

Zomato Delete Order Feature : ఒకప్పుడు న‌చ్చింది తినాలి అంటే ఇంట్లో వండుకోవ‌డం లేదంటే హోట‌ల్‌కి వెళ్లి లాగించేయ‌డం వంటివి చేసేవాళ్లం. అయితే.. ఎప్పుడైతే ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌లు వ‌చ్చాయో అప్ప‌టి నుంచి క‌ష్టాలు తీరాయి. ఎంచ‌క్కా కూర్చున్న ద‌గ్గ‌రికే కావాల్సిన ఫుడ్‌ను డెలివ‌రీ చేస్తున్నాయి. ఆన్‌లైన్ డెలివ‌రీ సంస్థలు అంటే ఎక్కువ మందికి గుర్తుకు వ‌చ్చేది జొమాటో(Zomoto). వినియోగ‌దారుల‌కు సేవ‌ల్లో నాణ్య‌త‌ను పెంచాల‌ని కంపెనీ ఎప్ప‌టిక‌ప్పుడు త‌ద‌నుగుణంగా మార్పులు తీసుకువ‌స్తూనే ఉంది.

తాజాగా జొమాటో ఓ స‌రికొత్త ఫీచ‌ర్‌ను తీసుకువ‌చ్చింది. దీని వ‌ల్ల మా క‌ష్టాలు తొల‌గిపోయాయ‌ని అంటున్నారు ఎంతో మంది నెటిజ‌న్లు. ఇంత‌కి జొమాటో తీసుకువ‌చ్చిన ఆ ఫీచ‌ర్ ఏంటో తెలుసా..? అది మ‌రేమిటో కాదు డిలీట్ ఆర్డ‌ర్ (Zomoto Delete Order) ఆప్ష‌న్‌. దీని వ‌ల్ల ఏం లాభం అని అంటారా..? అక్క‌డికే వ‌స్తున్నాం ఆగండి.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం ఏం ఆర్డ‌ర్ చేశామో హిస్ట‌రీలో ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. మ‌నం ఏం తిన్నాయో ఎవ‌రైనా స‌రే దాన్ని చూస్తే తెలిసిపోయేది. దీని వ‌ల్ల కొంద‌రు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్న‌ట్లు జొమాటో దృష్టికి తీసుకువెళ్లారు. కొంచెం ఆల‌స్య‌మైనా గానీ.. ఇప్ప‌టి నుంచి ఆ ఇబ్బందులు తొల‌గిపోయాయి. డిలీట్ ఆర్డ‌ర్ ఆప్ష‌న్ యూజ్ చేసి ఆర్డ‌ర్ చేసిన హిస్ట‌రీని తొల‌గించ‌వ‌చ్చు. ఈ విష‌యాన్ని జొమాటో సంస్థ సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశాడు.

Also Read : Zomato: రూ.133 తో జాక్ పాట్ కొట్టిన మహిళ, పాపం జొమాటో

క‌ర‌ణ్ సింగ్ అనే వ్య‌క్తి అర్థ‌రాత్రి ఫుడ్ ఆర్డ‌ర్ చేసుకుని తింటున్నాడ‌ట‌. అయితే.. హిస్ట‌రీ ఉండ‌డంతో త‌న భార్య‌కు దొరికిపోతున్నాడ‌ట‌. ఇది అత‌డి ఒక్క‌డి స‌మ‌స్యే కాద‌ని ఇంకా ఎంతోమంది స‌మ‌స్య అని చెప్పాడు. ఇక దొరికిపోతాం అనే భ‌యాలు అక్క‌ర‌లేద‌ని డిలీట్ ఆర్డ‌ర్ ఆప్ష‌న్ ఉప‌యోగించి ఆర్డ‌ర్ హిస్ట‌రీని తొలగించుకోవ‌చ్చున‌ని తెలిపాడు. అయితే దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని గోయల్ సూచించారు.