Quiet Firing: క్వైట్ ఫైరింగ్ అంటే ఏమిటో తెలుసా..? ఉద్యోగాల‌లో ఇదొక కొత్త ట్రెండ్!

క్వైట్ ఫైరింగ్ అంటే ఏమిటో తెలుసా..? ఈ మ‌ధ్య కాలంలో ఉద్యోగ రంగంలో కొత్త కొత్త ట్రెండ్‌లు మొద‌లయ్యాయి. ఆ ట్రెండ్ జాబితాలో తాజాగా వ‌చ్చి చేరిందే క్వైట్ ఫైరింగ్‌.

  • Written By:
  • Updated On - April 23, 2024 / 11:24 AM IST

Quiet Firing: క్వైట్ ఫైరింగ్ (Quiet Firing) అంటే ఏమిటో తెలుసా..? ఈ మ‌ధ్య కాలంలో ఉద్యోగ రంగంలో కొత్త కొత్త ట్రెండ్‌లు మొద‌లయ్యాయి. ఆ ట్రెండ్ జాబితాలో తాజాగా వ‌చ్చి చేరిందే క్వైట్ ఫైరింగ్‌. ఈ ర‌క‌మైన ఫైరింగ్ అంటే ఒక ఉద్యోగిని కంపెనీ వ‌దులుకోవాలని ఫిక్స్ అయిన‌ప్పుడు ఈ ఫార్ములాను ఉప‌యోగిస్తుంటారు. అయితే ఒక కంపెనీ ఓ ఉద్యోగిని వ‌దులుకోవ‌టానికి చాలా కార‌ణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మ‌నం ఆలోచించాల్సింది ఆర్థికంగా కంపెనీ బ‌లంగా ఉందా..? లేదా..? మ‌రో విష‌యం మ‌నం స‌క్ర‌మంగా ప‌ని చేస్తున్నామా లేదా అనే ఇలాంటి విష‌యాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

క్వైట్ ఫైరింగ్ అంటే ఏమిటంటే..?

క్వైట్ ఫైరింగ్ అంటే కంపెనీ మ‌నల్ని ఉద్యోగం నుంచి తీసివేయ‌దు. కానీ మ‌న‌మే ఉద్యోగం మానేసేలా చేస్తుంది. ఎలాగంటే మ‌న ప‌ని గంట‌ల కంటే ఎక్కువ స‌మ‌యం ప‌ని చేయించుకోవ‌డం, స‌ద‌రు ఉద్యోగికి మ‌ర్యాద ఇవ్వ‌క‌పోవడం, అల‌వాటు లేని ప‌నుల‌ను అప్ప‌గించ‌డం లాంటివి కంపెనీ చేస్తుంది. ఇలా చేస్తే స‌ద‌రు ఉద్యోగికి చికాకు, ప‌ని మీద ఇంట్రెస్ట్ పోయి త‌నంత‌టా తానే ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఇలా చేయ‌డానే క్వైట్ ఫైరింగ్ అంటారు. చాలా సంస్థ‌లు ఈ ఫార్ములాను త‌మ ఉద్యోగుల‌ను తీసేయడంలో ఉప‌యోగిస్తున్న‌ట్లు ప‌లు నివేదిక‌లు, అలాగే ఉద్యోగులు పేర్కొన్నారు.

Also Read: RCB Playoffs: ఆర్సీబీకి ఇంకా ప్లేఆఫ్ అవ‌కాశాలు ఉన్నాయా..? ఇలా జ‌రిగితే వెళ్లే ఛాన్స్‌..?

ఇటీవ‌ల కాలంలో ఎక్కువ డ్రై ప్ర‌మోష‌న్ మాదిరిగానే ఈ క్వైట్ ఫైరింగ్ కూడా ట్రెండ్‌గా మారింది. డ్రై ప్ర‌మోష‌న్ అంటే ఒక ఉద్యోగి బాధ్య‌త‌లు మాత్ర‌మే పెరుగుతాయి. అత‌ని నెల‌వారీ జీతంలో ఎలాంటి మార్పు ఉండ‌దు. కానీ ప‌ని భారం, బాధ్య‌త‌లు పెరుగుతాయి. అయితే క్వైట్ ఫైరింగ్ బ‌దులు డైరెక్ట్ ఫైరింగ్ చేయొచ్చు క‌దా అనే ప్ర‌శ్న చాలా మందిలో ఉంటుంది. ఇలా డెరెక్ట్ ఫైరింగ్ చేస్తే కంపెనీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా కంపెనీ స‌ద‌రు ఉద్యోగికి ఇవ్వాల్సిన ప‌రిహారాలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే లీవ్స్‌, ఇంక్రిమెంట్ స‌మ‌యంలో రావాల్సిన మొత్తాన్ని ఉద్యోగి అడిగి తీసుకునే హ‌క్కు ఉంటుంది. అందుకోస‌మే కంపెనీలు ఈ క్వైట్ ఫైరింగ్ ప్లాన్‌ను అనుస‌రిస్తున్నాయి.

We’re now on WhatsApp : Click to Join

క్వైట్ ఫైరింగ్ మాదిరిగానే క్వైట్ హైరింగ్ కూడా ఉంది. క్వైట్ హైరింగ్ అంటే త‌క్కువ జీతానికి వ‌చ్చే ఉద్యోగుల‌ను తీసుకోవ‌డం, అలాగే సంస్థ‌లోనే ప‌ని చేస్తూ ప‌లు రంగాల్లో అనుభ‌వం ఉన్నవారికి ప‌నులు అప్ప‌గించ‌టం లాంటివి కూడా క్వైట్ గా జ‌రిగిపోతున్నాయి.