Site icon HashtagU Telugu

Maha Kumbh 2025 : భక్తులపై ఎయిర్లైన్స్ దోపిడీ..!

Airlines Company

Airlines Company

మహా కుంభమేళా 2025 (Maha Kumbh 2025) సందర్భంగా త్రివేణి సంగమం(Triveni Sangam)లో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్‌(Prayag Raj)కి చేరుకునేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని తమ లాభాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి అనేక సంస్థలు. వాటిలో ఎయిర్లైన్స్ సంస్థ (Airlines company) ఒకటి. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న తరుణంలో సంస్థ టికెట్ ధరలను భారీగా పెంచి భక్తులకు షాక్ ఇచ్చింది.

Railway Jobs 2025 : రైల్వేలో 32438 జాబ్స్.. టెన్త్‌తోనూ ఛాన్స్.. తెలుగులోనూ పరీక్ష

ముంబై మరియు ఢిల్లీ నుంచి ప్రయాగ్ రాజ్‌కి టికెట్ ధరలు సాధారణంగా రూ. 16,000 ఉంటే, ఇప్పుడు రూ. 50,000 నుంచి రూ. 60,000 లకు పెంచారు. హైదరాబాద్ నుంచి ప్రయాణించాలనుకునే భక్తులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. టికెట్ రేట్ల భారీ పెరుగుదల వల్ల సామాన్య భక్తులు తమ ప్రయాణం పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ టికెట్ రేట్ల పెంపు గురించి పలు ఫిర్యాదులు రావడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దృష్టికి ఈ అంశం చేరింది. టికెట్ ఛార్జీలను రేషనలైజ్ చేయాలని DGCA ఎయిర్లైన్స్‌లకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. కానీ, ఇప్పటికీ టికెట్ ధరలు మారకపోవడం భక్తులను నిరాశకు గురిచేస్తోంది.

ఎయిర్లైన్స్ ఇలా ధరలను పెంచడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహా కుంభమేళా వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వ్యాపార లాభాలకు కాకుండా భక్తుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చేలా ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి మహా కుంభమేళా 2025 భక్తుల సందడి మధ్య ఎయిర్లైన్స్ ఛార్జీల పెంపు సమస్యగా మారింది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని, ఈ అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడం ద్వారా భక్తులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.