బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కోసం కేటాయింపులను 40,000 కోట్ల రూపాయలకు పెంచారు. భారత్‌ను గ్లోబల్ చిప్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు ISM 2.0 (ఇండియా సెమీకండక్టర్ మిషన్) రెండో దశను ప్రారంభించనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Budget 2026

Budget 2026

Budget 2026: బడ్జెట్ 2026లో ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించే వ్యయాన్ని రికార్డు స్థాయికి చేర్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి మొత్తం 12.2 లక్షల కోట్ల రూపాయలను కేపెక్స్ కోసం కేటాయించారు. ఇది గత ఏడాది కేటాయించిన 11.11 లక్షల కోట్ల కంటే సుమారు 10% ఎక్కువ.

రక్షణ మంత్రిత్వ శాఖ- 7.8 లక్షల కోట్లు

ఈసారి కూడా బడ్జెట్‌లో రక్షణ రంగానికే సింహభాగం దక్కింది. రక్షణ బలగాల ఆధునికీకరణ కోసం ప్రత్యేకంగా 2.1 లక్షల కోట్లు కేటాయించారు. ఈ నిధులను కొత్త యుద్ధ విమానాలు, సబ్ మెరైన్లు (జలాంతర్గాములు), స్వదేశీ ఆయుధాల కొనుగోలు కోసం ఉపయోగిస్తారు.

Also Read: ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

రైల్వేలు- రవాణా

హై-స్పీడ్ రైల్: 7 కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్ల (ముంబై-పుణే, ఢిల్లీ-వారణాసి) కోసం భారీగా నిధులు కేటాయించారు.

కవచ్: రైలు ప్రమాదాలను నివారించే ‘కవచ్’ సాంకేతికతను విస్తరించడానికి బడ్జెట్‌ను పెంచారు.

ఫ్రైట్ కారిడార్: పశ్చిమ బెంగాల్‌లోని డాన్కుని నుండి సూరత్ వరకు కొత్త ‘డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్’ (సరుకు రవాణా మార్గం) నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.

మాన్యుఫ్యాక్చరింగ్, చిప్స్

ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కోసం కేటాయింపులను 40,000 కోట్ల రూపాయలకు పెంచారు. భారత్‌ను గ్లోబల్ చిప్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు ISM 2.0 (ఇండియా సెమీకండక్టర్ మిషన్) రెండో దశను ప్రారంభించనున్నారు.

వ్యవసాయం- గ్రామీణాభివృద్ధి

AI పోర్టల్: ‘భారత్-విస్తార్’ (Bharat-VISTAAR) అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ కోసం నిధులు మంజూరు చేశారు.

జలవనరులు: జలాశయాలు, అమృత్ సరోవర్ల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు.

MSME: చిన్న తరహా పరిశ్రమల కోసం రూ. 10,000 కోట్లతో ‘MSME గ్రోత్ ఫండ్’ ఏర్పాటు చేశారు.

హెల్త్- బయో-ఫార్మా

కొత్త వ్యాక్సిన్లు, మందుల పరిశోధన కోసం వచ్చే 5 ఏళ్లకు గానూ 10,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. రాష్ట్రాలలో 5 కొత్త ‘మెడికల్ హబ్‌ల’ ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక సహాయం అందించనుంది.

  Last Updated: 01 Feb 2026, 07:30 PM IST