Diwali: పండుగల వాతావరణం, దీపావళి రెండూ కలిసి భారతదేశం అంతటా ఆనందాన్ని నింపుతాయి. దీపావళి (Diwali) సందర్భంగా ప్రజలు తమ కుటుంబంతో కలిసి సంతోషాలను పంచుకుంటారు. అలాగే అనేక రకాల వంటకాలు, మిఠాయిలను ఆస్వాదిస్తారు. ఈ సమయంలో యువత, పిల్లలు పటాకులు కాలుస్తారు. దీపావళి రోజున పటాకులు కాల్చేటప్పుడు కొన్నిసార్లు అవాంఛిత సంఘటనలు జరుగుతాయి. వీటిలో ప్రాణ, ఆస్తి నష్టం కూడా సంభవిస్తుంది. అంతేకాకుండా చాలా మంది తీవ్రంగా గాయపడతారు.
ఈసారి దీపావళికి ముందు వీటి నుంచి రక్షించుకోవడానికి మీరు మీ కోసం, మీ కుటుంబం కోసం తప్పనిసరిగా ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్‌ను తీసుకోవాలి. తద్వారా దీపావళిలో పటాకుల వల్ల జరిగే ఏ విధమైన సంఘటన నుండి అయినా మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ చాలా తక్కువ ప్రీమియంతో వస్తుంది. ఇందులో మీకు మంచి కవరేజ్ లభిస్తుంది. అలాంటి కొన్ని ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్‌ల గురించి తెలుసుకుందాం.
ఫోన్‌పే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ దీపావళి సందర్భంగా జరిగే ప్రమాదాల నుండి తమ వినియోగదారులను రక్షించడానికి, గత సంవత్సరం ఫోన్‌పే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్‌ను ప్రారంభించింది. ఈ సంవత్సరం కూడా కంపెనీ ఈ ఇన్సూరెన్స్ పాలసీని కొనసాగిస్తోంది. కేవలం రూ. 11 రూపాయలకే మీరు ఫోన్‌పే ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీకు రూ. 25,000 వేల రూపాయల కవరేజ్ లభిస్తుంది. ఫోన్‌పే ఈ పాలసీ 11 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.
Also Read: Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!
CoverSure ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ సంవత్సరం దీపావళి శుభ సందర్భంగా ఫిన్‌టెక్ కంపెనీ CoverSure ఒక కొత్త ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించింది. కంపెనీ రూ. 5 రూపాయల ప్రీమియంతో రూ. 50,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవర్‌ను అందిస్తోంది. CoverSure ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ పాలసీలో డెత్ క్లెయిమ్ కింద రూ. 50 వేల రూపాయల కవరేజ్ ఇవ్వబడుతోంది. పటాకుల వల్ల కలిగిన గాయంపై రూ. 10 వేల రూపాయల క్లెయిమ్ లభిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీ కేవలం 10 రోజుల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పాలసీని కొనుగోలు చేయవచ్చు.
ఈ పాలసీ గురించి కంపెనీ ఫౌండర్, CEO సౌరభ్ విజయవర్గీయ సమాచారం ఇస్తూ.. దీపావళి పండుగలో అగ్ని, పటాకాల ప్రమాదం ఉంటుంది. అందుకే కంపెనీ రూ. 5 వంటి చిన్న మొత్తంలో ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తోంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీ చిన్నదైనా, మీ కుటుంబానికి ఒక రక్షణ కవచం వంటిది అని అన్నారు.