Cognizant VS Infosys : ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్.. ఐటీ దిగ్గజ కంపెనీలు. ఓ విషయంలో ఇప్పుడు ఈ రెండు కంపెనీలు తలపడుతున్నాయి. ఒకదానిపై మరొకటి న్యాయపోరాటం చేస్తున్నాయి. ఇంతకీ ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :200 Year Old Peoples: 200 ఏళ్లు దాటిన వారు 2వేల మందికిపైనే.. సంచలన ప్రకటన
ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలు..
తమ హెల్త్ కేర్ సాఫ్ట్‌వేర్ ట్రెజెట్టో నుంచి వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించిందని కాగ్నిజెంట్ ఆరోపిస్తోంది. ‘‘నాన్ డిస్‌క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్ (NDAAs) ద్వారా ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. అయితే దీనిపై ఆడిట్ చేసేందుకు ఇన్ఫోసిస్ నిరాకరించింది’’ అని కాగ్నిజెంట్ పేర్కొంది. ఈమేరకు ఇన్ఫోసిస్‌పై అభియోగాలతో 2024 ఆగస్టులో అమెరికాలోని ఓ కోర్టులో కాగ్నిజెంట్ కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది.
Also Read :Gold Rush : ట్రంప్ ఎఫెక్ట్.. విమానాల్లో బంగారాన్ని తెప్పిస్తున్న బ్యాంకులు
రవికుమార్ ఎవరు ? ఏం చేశారు ?
కాగ్నిజెంట్ కంపెనీ చేసిన ఆరోపణలను ఇన్ఫోసిస్(Cognizant VS Infosys) ఖండించింది. కాగ్నిజెంట్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ బహిరంగంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం కాగ్నిజెంట్‌లో ఉన్న రవికుమార్ తమ కంపెనీ(ఇన్ఫోసిస్)లో పనిచేసిన టైంలో హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ విడుదల చేయడాన్ని ఆలస్యం చేశారని ఇన్ఫోసిస్ ప్రత్యారోపణలు చేసింది. ఆ సమయంలో కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం, రవి కుమార్ చర్చలు జరిపారని తెలిపింది. రవికుమార్ 2022 అక్టోబర్‌లో ఇన్ఫోసిస్‌ను విడిచిపెట్టారు. ఆ మరుసటి ఏడాది(2023) జనవరిలోనే కాగ్నిజెంట్‌లో సీఈఓ హోదాలో చేరారు. ఈ రెండు ఐటీ కంపెనీలు అమెరికాలోని ఆరోగ్య సంరక్షణ సేవల విభాగంలో పరస్పరం పోటీపడుతున్నాయి. ఇన్ఫోసిస్ ఆదాయంలో దాదాపు 7.5 శాతం లైఫ్ సైన్సెస్ విభాగం నుంచే వస్తోంది. మొత్తం మీద ఆసక్తికర రీతిలో కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ మధ్య న్యాయపోరు నడుస్తోంది. ఐటీ పరిశ్రమలో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.