Site icon HashtagU Telugu

Coca Cola: బ్రాండెడ్ డ్రింక్‌ను నిలిపివేసిన‌ కోకా కోలా.. కార‌ణం ఇదేనా..?

Coca Cola

Coca Cola

Coca Cola: గ్లోబల్ శీతల పానీయాల బ్రాండ్ కోకా కోలా (Coca Cola) దాని అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకదానిని నిలిపివేయాలని నిర్ణయించుకోవడం ద్వారా అభిమానులను నిరాశపరిచింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్‌లో కంపెనీ ఈ విషయాన్ని ధృవీకరించింది. వాస్తవానికి ఈ డ్రింక్ మార్కెట్లో అందుబాటులో లేదు అని అభిమానులు నిరంతరం అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు కోకా కోలా స‌మాధానాలు ఇచ్చింది. ఈ డ్రింక్‌ ఏమిటి, ఎందుకు ఆగిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం..!

కోకా కోలా ఉత్పత్తి డైట్ కోక్. దీనిలో స్ప్లెండా మిశ్రమంగా ఉంటుంది. స్ప్లెండా ఒక కృత్రిమ స్వీటెనర్. అనేక కోకా కోలా పానీయాలలో ఉపయోగించే అస్పర్టమే స్థానంలో ఇది డైట్ కోక్‌లో ఉపయోగించబడింది. గత ఏడాది జూలైలో WHO ఈ కృత్రిమ పదార్ధాన్ని మానవులకు ప్రమాదకరమని, ఇది క్యాన్సర్‌కు కారణమవుతుందని చెప్పినప్పుడు అస్పర్టమే పేరు వివాదానికి దారితీసింది.

Also Read: Neeta Ambani Gift: కోడలికి అత్యంత ఖ‌రీదైన గిఫ్ట్ ఇచ్చిన నీతా అంబానీ.. బ‌హుమ‌తి ధ‌ర రూ. 640 కోట్లు..!

ప్ర‌శ్న‌లు సంధించిన వినియోగ‌దారులు

గత కొన్ని నెలలుగా ఈ డైట్ కోక్ దుకాణాల్లో దొరక్క ఎక్కడికి పోయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక వినియోగదారు కంపెనీని ఈ విధంగా అడిగాడు. మీరు ఇప్పటికీ స్ప్లెండాతో డైట్ కోక్ తయారు చేస్తున్నారా? నాకు అస్పర్టమే అలెర్జీ అని రాసుకొచ్చాడు. అదే సమయంలో స్ప్లెండాతో డైట్ కోక్‌ను ఎక్కడ కొనుగోలు చేయవచ్చు అని మరొక వినియోగదారు అడిగారు. ఇది నిలిపివేయబడిందా? కోవిడ్ తర్వాత నేను చూడలేదు. ఈ ప్రశ్నలకు కంపెనీ ఎట్టకేలకు సమాధానమిచ్చింది.

కంపెనీ స‌మాధాన‌మిదే..!

దురదృష్టవశాత్తు స్ప్లెండాతో కూడిన డైట్ కోక్ నిలిపివేయబడిందని కోకా కోలా ఒక పోస్ట్‌లో రాసింది. దీనికి క్షమాపణలు కోరుతున్న‌ట్లు కంపెనీ తెలిపింది. చాలా మంది వినియోగదారులు ఈ పానీయం సాధారణ డైట్ కోక్ కంటే చాలా మంచిదని భావిస్తారు. ఒక వినియోగదారు ఈ నిర్ణయానికి చాలా కలత చెంది ఇలా రాశాడు. “దయచేసి నాకు చెప్పండి. స్ప్లెండాతో కూడిన డైట్ కోక్ ఈ గ్రహం మీద ఉత్తమమైన పానీయం అని భావించే వ్యక్తిని నేను మాత్రమే కాదు చాలా మంది ఉన్నారని రాశాడు. కోకా కోలా దీనిని త్వరలో పునరుత్పత్తి చేయడం ప్రారంభిస్తుందని ఒక నెటిజన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.