Copy Paste Blunder: బ్యాంకింగ్ రంగం అంటే ఆషామాషీ విషయం కాదు. నిత్యం డబ్బులతో వ్యవహారం. లెక్కలేనంత అమౌంటు పలు బ్యాంకు ఖాతాల్లో ఉంటుంది. అందుకే బ్యాంకు ఉద్యోగులు అత్యంత ఫోకస్‌తో పనిచేయాల్సి ఉంటుంది. ప్రత్యేకించి కంప్యూటర్‌లోని కమాండ్స్‌ను నొక్కడంలోనూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఈక్రమంలో పనిపై ఏ మాత్రం శ్రద్ధ లోపించినా, తప్పుడు కంప్యూటర్ కమాండ్స్ నొక్కినా కోట్ల రూపాయలు ఇటువి అటు.. అటువి ఇటు అయిపోతాయి. ఇలాంటిదే ఓ ఘటన తాజాగా చోటుచేసుకుంది. వివరాలివీ..
Also Read :Solar Laptop : సోలార్ లాప్‌టాప్ వచ్చేసింది.. పనితీరు వివరాలు ఇవిగో
ఇలా జరిగింది..
ఓ ఖాతాదారుడు సిటీ బ్యాంకుకు వచ్చాడు. తన బ్యాంకు అకౌంటు నుంచి మరొక ఖాతాకు నగదును(Copy Paste Blunder) బదిలీ చేయాల్సి ఉందన్నాడు. బ్యాంకు ఉద్యోగి సరేనన్నాడు. ఇందుకోసం తన కంప్యూటర్‌లో లావాదేవీ ప్రక్రియను మొదలుపెట్టాడు. అంతకు ముందు కాపీ చేసిన ఒక ఖాతాదారుడి అకౌంట్ నంబరునే నగదు కాలమ్‌లో పేస్ట్ చేశాడు. దీంతో ఆ బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.52వేల కోట్లు మరో ఖాతాకు బదిలీ అయ్యాయి. ఈ తప్పిదాన్ని మరుసటి రోజు గుర్తించారు. 2024 ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. దీనిపై స్పందించిన సిటీగ్రూప్.. నగదు బదిలీ ప్రక్రియలో జరిగిన తప్పిదాన్ని వెంటనే గుర్తించి పరిష్కరించినట్లు వెల్లడించింది. దీని వల్ల ఖాతాదారులకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సిటీ గ్రూప్ చెప్పింది. బ్యాంకు లావాదేవీల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించి ఆటోమేషన్‌ను పెంచినట్లు పేర్కొంది.
Also Read :What Is Vantara: ‘వన్ తార’లో ప్రధాని సందడి .. ఏమిటిది ? మోడీ ఏం చేశారు ?
ఇంకా 2 శాతం రూ.2వేల నోట్లు ప్రజల వద్దే
రూ.2000 నోట్లను బ్యాన్ చేసి రెండేళ్లు గడిచాయి. అయినా నేటికీ అన్ని రూ.2వేల నోట్లు ఆర్‌బీఐ వద్దకు తిరిగి చేరలేదు. రూ.2000 నోట్లలో దాదాపు రెండు శాతం ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఆ నోట్లు చెల్లవు. అయినా వాటిని కొందరు ఉంచుకోవడం గమనార్హం. 2023 మే నెలలో కేంద్ర ప్రభుత్వం రూ.2వేల నోట్లను రద్దు చేసింది. వీటిలో 98.18 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి.