Cash Is King : ‘యూపీఐ’ రెక్కలు తొడిగినా క్యాషే కింగ్ !

Cash Is King : ‘యూపీఐ’ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్.

  • Written By:
  • Publish Date - April 30, 2024 / 11:20 AM IST

Cash Is King : ‘యూపీఐ’ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ప్రజలు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లను ఎంతగా వాడుతున్నారో మనకు తెలుసు. ఇంతగా యూపీఐ లావాదేవీల హవా నడుస్తున్నా.. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాలు ఏమాత్రం తగ్గడం లేదు. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో నెలవారీ సగటు ఏటీఎం నగదు విత్‌డ్రాలు 5.51 శాతం మేర పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు విత్ డ్రాలు రూ.1.43 కోట్లకు పెరిగాయి. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు విత్ డ్రాలు రూ.1.35 కోట్లు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు లాజిస్టిక్స్, టెక్నికల్ సర్వీసెస్ అందించే ‘సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్’ కంపెనీ నివేదికలో ఈవివరాలు వెల్లడయ్యాయి. నెలవారీ ప్రాతిపదికన చూసినా 2022-23 ఆర్థిక సంవత్సరం కంటే గత ఆర్థిక సంవత్సరంలో ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రాలు 10 నెలల వ్యవధిలో సగటున 7.23 శాతం మేర పెరిగాయి.  ప్రజలు నగదును విత్‌‌డ్రా చేసుకొని.. చేతిలో క్యాష్‌ను పెట్టుకునేందుకు ఆసక్తి  చూపిస్తుండటం వల్లే ఏటీఎం విత్‌డ్రా సౌకర్యానికి ఇంకా ఆదరణ తగ్గలేదని నివేదిక చెప్పింది. యూపీఐ లావాదేవీల ప్రాధాన్యత ఎంత పెరిగినప్పటికీ.. చేతిలో నగదు(Cash Is King)  ఉంచుకోవడానికి ఉన్న ప్రాముఖ్యత తగ్గడం లేదని పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇలా.. 

  • మన దేశంలో అత్యధిక సగటు నగదు విత్ డ్రాలు కర్ణాటక రాష్ట్రంలో రూ.1.83 కోట్లుగా, ఢిల్లీలో 1.82 కోట్లుగా, బెంగాల్‌లో రూ.1.82 కోట్లుగా ఉన్నాయి.
  • మన దేశంలోని మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రాలు సగటున 10.37 శాతం మేర పెరిగాయి.
  • పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 3.94 శాతం, నగరాల్లో 3.73 శాతం మేర ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాలు పెరిగాయి.
  • ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఏటీఎంల నుంచి  నగదు విత్ డ్రాలు భారీగా పెరిగాయి.

Also Read :10th Class Results: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?

  • మెట్రో నగరాల్లోని ఏటీఎంలలో ప్రభుత్వ బ్యాంకుల ఏటీఎంలు 49 శాతం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలలో ప్రభుత్వ బ్యాంకుల ఏటీఎంలు 51 శాతం ఉన్నాయి.
  • ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంలు మెట్రో నగరాల్లో 64 శాతం ఉన్నాయి.