Site icon HashtagU Telugu

BSNL ఫ్రీడమ్ ప్లాన్..! రూ.1కే 30 రోజుల వ్యాలిడిటీ 2జీబీ డేటా, అపరిమిత కాల్స్..

Bsnl Freedom Plan

Bsnl Freedom Plan

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో శుభవార్త చెప్పింది. ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ తీసుకొచ్చింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒక్క రూపాయికే సిమ్ కార్డుతో పాటు 30 రోజుల వ్యాలిడిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్ అందించడంతో ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో మరోసారి ఈ ప్లాన్ అందుబాటులోకి తెచ్చినట్లు తాజాగా ప్రకటించింది. మరి ఆ ప్లాన్ పూర్తి వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం దేశంలో టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు మార్కెట్ వాటాలో ముందున్నాయి. ఇప్పటికే 5G నెట్‌వర్క్ సైతం తీసుకొచ్చాయి. అయితే ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్  చాలా వెనుకబడిందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే 4G నెట్‌వర్క్ అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరకు, అదనపు బెనిఫిట్స్ కల్పిస్తూ ప్రత్యేక ప్లాన్లు తీసుకొస్తోంది. చాలా తక్కువ ధరల్లో రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉండడంతో బీఎస్ఎన్ఎల్ వైపు యూజర్లు మళ్లుతున్నారు.

ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ మరోసారి తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. గత ఆగస్ట్ 15వ తేదీన భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  ఆజాదీ కా ప్లాన్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ కేవలం ఒక్క రూపాయికే అందించింది. 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ వంటివి ఇవ్వడంతో ప్రజలను ఆకర్షించింది. ఈ ప్లాన్ ద్వారా కొత్త సిమ్ కార్డు తీసుకునే అవకాశం లభించింది. అయితే ఈ ప్లాన్ ఆగస్టు 31 వరకే అందించడంతో చాలా మంది నిరాశ చెందారు. ఈ ఆఫర్ మళ్లీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రజల డిమాండ్ మేరకు ఈ ఫ్రీడమ్ ప్లాన్ మరోసారి తీసుకొచ్చినట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బీఎస్ఎన్ఎల్ తాజాగా ప్రకటించింది.

ప్రజల డిమాండ్‌తో బీఎస్ఎన్ఎల్ రూ.1 ఫ్రీడమ్ ప్లాన్ తిరిగి వచ్చేసింది. దీంతో ఉచితంగా సిమ్ పొందొచ్చు. 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అది కేవలం కొత్త యూజర్లకు మాత్రమే అని ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ ఆఫర్ డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ ద్వారా నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ సహా రోజుకు 2GB చొప్పున 4G డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమేనని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది. అంటే కొత్త సిమ్ తీసుకునే వారు ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతుంది. నెల రోజుల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఉచిత డేటా, కాల్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా కొత్త సిమ్ కొనుగోలు చేయాలనుకునే వారు దగ్గర్లోని రిటైలర్ లేదా బీఎస్ఎన్ఎల్ కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లాలని సూచించింది.

Exit mobile version