BSNL Affordable Plan: మీరు కూడా ప్రతి నెల రీఛార్జ్ చేయించుకోవడం వల్ల వచ్చే టెన్షన్‌తో విసిగిపోయి, చవకైన, లాభదాయకమైన ప్లాన్ కోసం వెతుకుతున్నారా? అయితే బీఎస్ఎన్ఎల్ (BSNL Affordable Plan) ఈ కొత్త ప్లాన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఒక రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఒక్కసారి రీఛార్జ్ చేస్తే పూర్తి 12 నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. దీని ధర కూడా చాలా తక్కవగానే ఉంది.
ఈ ప్లాన్‌లో ఏమి ప్రత్యేకం?
BSNL ఈ కొత్త ప్లాన్ ధర కేవలం రూ.1198. ఇందులో మీరు పూర్తి 365 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. అంటే నెలకు కేవలం 100 రూపాయల ఖర్చుతో మీరు పదేపదే రీఛార్జ్ చేయాల్సిన ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఉండవచ్చు.
ఈ ప్లాన్‌లో యూజర్లకు ప్రతి నెలా ఈ క్రింది ప్రయోజనాలు లభిస్తాయి
- 3GB డేటా
- 300 నిమిషాల కాలింగ్ (ఏ నెట్‌వర్క్‌పైనైనా)
- 30 SMS
ఈ ప్రయోజనాలన్నీ ప్రతి నెలా ఆటోమేటిక్‌గా రిన్యూ అవుతాయి. అంటే యూజర్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం పాటు టెన్షన్ ఫ్రీ!
ఈ ప్లాన్ ఎందుకు ప్రత్యేకం?
ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ధరలను పెంచినప్పటి నుంచి చాలా మంది BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో బేసిక్ ఇంటర్నెట్, కాలింగ్ సౌకర్యం కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది.
నెట్‌వర్క్ కవరేజ్‌పై దృష్టి
BSNL తన నెట్‌వర్క్‌ను వేగంగా అప్‌గ్రేడ్ చేస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దీని 4G లేదా 5G సేవలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. కాబట్టి మీరు BSNL సిమ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా మీ ప్రాంతంలో నెట్‌వర్క్ కవరేజ్‌ను తప్పకుండా చెక్ చేయండి.
BSNL ఒక కొత్త లైవ్ నెట్‌వర్క్ మ్యాప్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా మీరు మీ ప్రాంతంలో BSNL ఏ నెట్‌వర్క్ అందుబాటులో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఇది మీ ప్రాంతంలో నెట్‌వర్క్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
చిన్న పట్టణాలు, వృద్ధులకు ప్రత్యేకం
ఈ ప్లాన్ ముఖ్యంగా మొబైల్‌ను ఎక్కువగా ఉపయోగించని వారికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు వృద్ధులు లేదా చిన్న పట్టణాల్లో నివసించే యూజర్లకు చాలా బాగుంటుంది. వారు ప్రతి నెలా రీఛార్జ్ కోసం ఆరాటపడాల్సిన అవసరం లేదు. అవసరమైన సౌకర్యాలు కూడా పొందుతారు.
Also Read: Telangana Govt Jobs: ఉద్యోగాల జాతర.. 18,236 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్లు
ఎయిర్‌టెల్ అతి చవకైన ప్లాన్
ఎయిర్‌టెల్ అతి చవకైన రీఛార్జ్ ప్లాన్ రూ. 1,199 ధరతో వస్తుంది. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అందించే ప్రయోజనాలు దీన్ని చవకైనదిగా చేస్తాయి. ఈ ప్లాన్‌లో ఏ నెట్‌వర్క్‌పైనైనా లోకల్, STD కాలింగ్ పూర్తిగా ఉచితం. మీరు 84 రోజుల పాటు అపరిమిత కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు.
జియో రూ.189 ప్లాన్
భారతదేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ జియో అతి చవకైన ప్లాన్ ఆఫర్ కేవలం రూ. 189 ధరతో లభిస్తుంది. ఇందులో మీకు పూర్తి 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్‌లో మీకు 2GB డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో యూజర్లకు అపరిమిత కాలింగ్, 300 SMS సౌకర్యం కూడా లభిస్తుంది.