హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఈ ఏడాది ఆన్‌లైన్ ఆర్డర్స్ గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా స్విగ్గీ మార్ట్ (Swiggy Mart) విడుదల చేసిన నివేదిక ప్రకారం, నగరవాసులు వివిధ వస్తువుల కోసం రికార్డు స్థాయిలో ఆర్డర్స్ చేశారు. దాదాపు 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లు ఆర్డర్ చేయడంతో పాటు, 2 లక్షల కండోమ్ ప్యాకెట్లు (Condoms ) బుక్ చేయడం ఆసక్తికరమైన అంశంగా మారింది. నగర ప్రజలు అత్యధికంగా పాలు, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వంటి కూరగాయలను ఆర్డర్ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ వస్తువుల రోజువారీ అవసరాలకు సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని స్పష్టమైంది. అలాగే హైదరాబాదీలు ఐస్క్రీమ్స్ పై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ దాదాపు రూ. 31 కోట్లు వెచ్చించినట్లు తేలింది.
బ్యూటీ ప్రొడక్ట్స్ రంగంలో కూడా నగరవాసులు ఇంట్రస్ట్ చూపించారు. ఈ క్రమంలో రూ. 15 కోట్లకు పైగా బ్యూటీ ప్రొడక్ట్స్ ఆర్డర్స్ చేయడం విశేషంగా నిలిచింది. ఈ నివేదికలు నగరంలోని మారుతున్న జీవనశైలిని ప్రతిబింబిస్తున్నాయి. సాధారణ అవసరాల నుంచి ప్రైవేట్ వాడకాల వరకు ప్రతి అంశంలోనూ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ ప్రభావం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కండోమ్ ప్యాకెట్ల ఆర్డర్స్ పరంగా నగరం దేశవ్యాప్తంగా ముందంజలో ఉంది. ప్రస్తుతం నగరవాసులే కాదు పట్టణాల్లో ఉండే ప్రజలు సైతం ఆన్లైన్ షాపింగ్ కు అలవాటుపడ్డారు. ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండానే తమకు ఏంకావాలో ఆన్లైన్ లో తక్కువ ధరలకే ఇంటికి వస్తుండడం తో ప్రతి ఒక్కరు ఆన్లైన్ షాపింగ్ పై మక్కువ పెంచుకుంటున్నారు. దీనికి ఉదాహరణే ఇప్పుడు స్విగ్గీ మార్ట్ విడుదల చేసిన నివేదిక.
Read Also : Pakistan-Afghanistan: మరో రెండు దేశాల మధ్య యుద్ధం.. మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా?