Bondada Engineering Ltd ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో నుంచి భారీ ఆర్డల్ లభించింది. ఏకంగా రూ. 627 కోట్ల ఆర్డర్ వచ్చినట్లు వెల్లడించిన క్రమంలో బోండాడా ఇంజినీరింగ్ కంపెనీ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది. క్రితం రోజు 4 శాతానికి పైగా లాభడింది. అయితే ఈరోజు లాభాల స్వీకరణతో స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది. ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కంపెనీ అయిన బోండాడా ఇంజినీరింగ్ లిమిటెడ్ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది. క్రితం రోజు ఈ స్టాక్ 4 శాతం మేర లాభపడింది. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్ కో) నుంచి భారీ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు బోండాడా ఇంజినీరింగ్ ప్రకటించిన క్రమంలో ఈ స్టాక్ ఫోకస్‌లోకి వచ్చింది. ఏపీలోని హిందూపురంలో 400/200 కేవీ సబ్‌స్టేషన్ వద్ద 225 మెగావాట్లయ 450 మెగావాట్ అవర్ సామర్థ్యం గల స్టాండలోన్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ప్రాజెక్ట్ చేపట్టాల్సి ఉందని తెలిపింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.627 కోట్లుగా ఉంది. ఈ వివరాలు బహిర్గతం చేసిన క్రమంలో స్టాక్ క్రితం రోజు భారీగా లాభాల్లోకి వెళ్లింది. ఈరోజు లాభాల స్వీకరణతో స్వల్ప నష్టాల్లోకి జారుకుంది.
Bondada Engineering Wins ₹627 Cr APTRANSCO BESS Order రూ.627 కోట్లు విలువైన స్టాండలోన్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టను 18 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉందని బోండాడా ఇంజినీరింగ్ లిమిటెడ్ తెలిపింది. వీటితో కలిపి తమ బ్యాటరీ స్టోరేజ్ ఫోర్ట్ ఫోలియే 1 గిగా వాట్ అవర్‌కు చేరినట్లు వెల్లడించింది. ఈ ఆర్డర్ వ్యూహాత్మకంగా ముఖ్యమైనది ఎందుకంటే ఇది దీర్ఘకాలిక, యాన్యుటీ ఆధారిత ఆదాయ ప్రవాహాన్ని సృష్టిస్తుంది. నగదు ప్రవాహన్ని, ఆదాయాల అంచనాను మెరుగుపరుస్తుంది. ఈ ప్రాజెక్టు దక్కించుకోవడంతో బొండాడా BESS పోర్ట్‌ఫోలియో దాదాపు 1 GWhకి చేరుకుంది. భారతదేశ గ్రిడ్-స్కేల్ ఇంధన నిల్వ స్థలంలో దాని స్థానాన్ని బలోపేతం చేస్తుంది. దేశ పునరుత్పాదక ఏకీకరణ, ఇంధన పరివర్తన లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4184.76 కోట్లుగా ఉంది. అలాగే ఈ కంపెనీ షేరు ధర రూ.360 స్థాయిలో ట్రేడవుతోంది.
కంపెనీ బలమైన ఆర్థిక పురోగతిని సాధించింది. ఆదాయం 2024 సెప్టెంబర్‌లో రూ.481 కోట్ల నుంచి 2025 సెప్టెంబర్‌లో రూ.1,217 కోట్లకు పెరిగింది. బలమైన ఆపరేటింగ్ లివరేజ్ కూడా లాభదాయకతను పెంచింది. నికర లాభం 151 శాతం పెరిగి రూ.37 కోట్ల నుంచి రూ.93 కోట్లకు చేరుకుంది. ఇది బలమైన అమలు, స్కేల్-ఆధారిత మార్జిన్ విస్తరణను ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ స్టాక్ 2.68 శాతం నష్టంతో రూ.360 వద్ద ట్రేడవుతోంది. గత నెల రోజుల్లో ఈ స్టాక్ 5 శాతం లాభపడింది. గత ఆరు నెలల్లో 17 శాతం నష్టపోయింది. గత ఏడాదిలో 40 శాతం నష్టపోయింది. గత 5 ఏళ్లలో మాత్రం 1000 శాతం మేర పెరిగి మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది.
