కేంద్ర ప్రభుత్వం మ‌రో కీలక నిర్ణయం!

ప్రభుత్వ నిర్ణయాన్ని రాఘవ్ చద్దా స్వాగతించారు. ఇది డెలివరీ రైడర్లందరికీ దక్కిన పెద్ద విజయం అని ఆయన అభివర్ణించారు.

Published By: HashtagU Telugu Desk
Blinkit

Blinkit

Blinkit: దేశంలో గిగ్ వర్కర్ల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. క్విక్ కామర్స్ కంపెనీలు పాటిస్తున్న 10 నిమిషాల డెలివరీ నిబంధనను తొలగించాలని కేంద్రం ఆదేశించింది. డెలివరీ సమయం విషయంలో డ్రైవర్లపై పడుతున్న విపరీతమైన ఒత్తిడిని తగ్గించడానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లైన Blinkit, Zomato, Zepto, Swiggy ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ చర్చల తర్వాత, డెలివరీ గడువును తొలగించేందుకు కంపెనీలు అంగీకరించాయి.

ప్రధాన మార్పులు

ప్రభుత్వ ఆదేశాల మేరకు Blinkit ఇప్పటికే తన బ్రాండింగ్ నుండి ’10 నిమిషాల డెలివరీ’ అనే వాగ్దానాన్ని తొలగించింది. త్వరలోనే జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటి ఇతర కంపెనీలు కూడా ఈ కఠినమైన గడువులను తొలగించనున్నాయి. గిగ్ వర్కర్లకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడం, రహదారి ప్రమాదాలను తగ్గించడం.

ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?

10 నిమిషాల్లో డెలివరీ చేయాలనే నిబంధన వల్ల డెలివరీ బాయ్స్ రోడ్లపై అత్యంత వేగంగా వెళ్తూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ అసాధ్యమైన లక్ష్యాలను చేరుకునే క్రమంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల డెలివరీ కార్మికులపై మానసిక, శారీరక ఒత్తిడి పెరుగుతోంది.

Also Read: పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

పార్లమెంటులో రాఘవ్ చద్దా పోరాటం

ఈ అంశాన్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా చాలా సీరియస్‌గా లేవనెత్తారు. “10 నిమిషాల డెలివరీ షరతు వల్ల వర్కర్లు రోడ్లపై అనవసరమైన రిస్క్ తీసుకుంటున్నారు” అని ఆయన పేర్కొన్నారు. కేవలం కస్టమర్ల సౌకర్యం కోసమే కాకుండా ఈ అల్ట్రా-ఫాస్ట్ డెలివరీల వెనుక ఉన్న మానవీయ కోణాన్ని కూడా ఆలోచించాలని ఆయన కోరారు. ఇటీవల ఆయన స్వయంగా డెలివరీ బాయ్‌గా మారి వారి కష్టాలను తెలుసుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

విజయంపై రాఘవ్ చద్దా స్పందన

ప్రభుత్వ నిర్ణయాన్ని రాఘవ్ చద్దా స్వాగతించారు. ఇది డెలివరీ రైడర్లందరికీ దక్కిన పెద్ద విజయం అని ఆయన అభివర్ణించారు. “ఈ లక్ష్యానికి మద్దతు ఇచ్చిన ప్రతి పౌరుడికి నా ధన్యవాదాలు” అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్నారు.

  Last Updated: 13 Jan 2026, 09:30 PM IST