Site icon HashtagU Telugu

Bitcoin : ట్రాంప్ విజయం తో బిట్‌కాయిన్ సరికొత్త రికార్డు

Bitcoin Record High 2024

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Presidential Election) రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ విజయం సాధించడం లో క్రిప్టో మార్కెట్లో (Crypto Market) జోరు అందుకుంది. బిట్‌కాయిన్ (Bitcoin) ఆల్‌టైమ్ గరిష్ఠం 75,000 మార్కును అధిగమించింది. ట్రేడింగ్‌లో సుమారు 9.26 శాతం పెరుగుద‌ల చూపించింది. ఓ ద‌శ‌లో ఆ క‌రెన్సీ విలువ 75వేల డాల‌ర్లుగా ట్రేడ్ అయ్యింది. ఆ త‌ర్వాత 74.2 వేల డాల‌ర్ల‌కు స్థిర‌ప‌డింది. యూఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ హవా కొనసాగడం, మార్కెట్ సెంటిమెంట్ బలంగా ఉండటమే ఇందుకు కారణం.

ఎన్నికల ప్రచారం సమయంలో ట్రాంప్.. క్రిప్టో కరెన్సీకి సంబంధించి కీలక హామీలు ప్రకటించారు. తాను ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ప్రభుత్వం తన బిట్‌కాయిన్ హోల్డింగ్‌లను ఎప్పటికీ విక్రయించకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తమ పార్టీ మద్దతుదారులకు బీర్లు, చీజ్ బర్గర్లు కొనేందుకు ట్రంప్ బిట్‌కాయిన్ వాడారు. ఇక ఇప్పుడు ట్రాంప్ విజయం సాధించడంతో మార్కెట్ లో బిట్‌కాయిన్ సరికొత్త రికార్డులకు చేరింది. దీంతో పాటు ఇతర క్రిప్టోకరెన్సీలలో ఈథర్ 7.2 శాతం పెరిగి 2,576 డాలర్లకు, బీఎన్‌బీ(5 శాతం), సొలానా(13.5 శాతం), డిజీకాయిన్(21.6 శాతం), చైన్‌లింక్(11.4 శాతం) పెరిగాయి.

బిట్‌కాయిన్ (Bitcoin) డిజిటల్ కరెన్సీగా లేదా క్రిప్టోకరెన్సీగా పిలవబడే ఒక వర్చువల్ కరెన్సీ. బిట్‌కాయిన్ వ్యవస్థ అనేది వినియోగదారుల మధ్య లావాదేవీలు, బ్యాంకులు లేదా ప్రభుత్వాల మాధ్యమం లేకుండా స్వతంత్రంగా నిర్వహించబడుతుంది. కేంద్ర ప్రభుత్వాలు లేదా బ్యాంకులు నియంత్రించని డిసెంట్రలైజ్డ్ కరెన్సీ ఇది. బ్లాక్‌చైన్ అనే టెక్నాలజీ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది వినియోగదారుల మధ్య లావాదేవీలను రికార్డు చేయడానికి ఒక డిజిటల్ లెడ్జర్‌గా పనిచేస్తుంది.

బిట్‌కాయిన్ వినియోగదారులు నేరుగా ఒకరికి ఒకరు బిట్‌కాయిన్లను పంపవచ్చు. అంటే మూడవ పక్షం అవసరం లేకుండా లావాదేవీలు జరిపే అవకాశం ఉందన్నమాట. దేశాలు మధ్య బిట్‌కాయిన్ ద్వారా డబ్బు మార్పిడి చేయడం సులభం. దీని ధర హెచ్చుతగ్గులతో ఉన్నప్పటికీ, దీన్ని ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌గా తీసుకుంటారు. కొంతమంది వ్యాపారులు బిట్‌కాయిన్‌ను చెల్లింపు రూపంలో అంగీకరిస్తున్నారు.

Read Also : TDP : మంత్రుల పనితీరును మెరుగుపరచుకోవాలి.. సీఎం చంద్రబాబు వార్నింగ్‌!