Site icon HashtagU Telugu

Bill Gates Children: బిల్‌గేట్స్ సంపదలో 1 శాతమే పిల్లలకు.. గేట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు ?

Bill Gates Kids Children Fortune Wealth

Bill Gates Children: ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్  వ్యవస్థాపకుడు, అపర కుబేరుడు బిల్ గేట్స్ సంచలన ప్రకటన చేశారు. తన ఆస్తుల పంపకంపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. సంపద నుంచి తన పిల్లలకు కేవలం 1 శాతం మాత్రమే ఇస్తానని బిల్‌గేట్స్ స్పష్టం చేశారు. దీని గురించి విని అందరూ షాక్ అయ్యారు. ‘‘నా సంపదతో నా పిల్లలు ఎదగాలని నేను కోరుకోవడం లేదు. వాళ్లు స్వతహాగా జీవితంలో విజయం సాధించాలనేది నా కోరిక’’ అని గేట్స్ తెలిపారు. భారత్‌కు చెందిన ప్రఖ్యాత యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్ రాజ్ షమానీకి ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఈవివరాలను బిల్‌గేట్స్ వెల్లడించారు. ఫిగరింగ్ అవుట్‌ పేరుతో ఈ పాడ్‌కాస్ట్‌ను ప్రసారం చేశారు.  మీరు కూడా raj shamani యూట్యూబ్ ఛానల్‌లో ఆ  ఇంటర్వ్యూను చూడొచ్చు.

Also Read :AI Snake Trapper : ‘ఏఐ స్నేక్‌ ట్రాపర్‌’ వచ్చేసింది.. పాముకాటు మరణాలకు చెక్

బిల్‌గేట్స్ నికర సంపద విలువ ప్రస్తుతం 162 బిలియన్ డాలర్లు. ఇది మన రూపాయల్లో దాదాపు రూ.13 లక్షల కోట్లు. దీనిలో 1 శాతం అంటే రూ.13వేల కోట్లను బిల్‌గేట్స్ తన పిల్లలకు ఆస్తిగా పంచనున్నారు. గేట్స్‌కు ముగ్గురు పిల్లలు. వారి పేర్లు.. ఫోయెబ్ అడేల్ గేట్స్ (Phoebe Adele Gates), జెన్నిఫర్ గేట్స్ ( Jennifer Gates), రోరీ జాన్ గేట్స్ (Rory John Gates).

జెన్నిఫర్ గేట్స్ ఏం చేస్తోంది ? 

బిల్ గేట్స్ కుమార్తె జెన్నిఫర్ గేట్స్ ఒక డాక్టర్. ఆమె అమెరికాలోని మౌంట్ సినాయ్ ఆస్పత్రిలో పిల్లల డాక్టర్.  జెన్నిఫర్ గేట్స్ భర్త ఒక ముస్లిం. ఆయన పేరు నాయెల్ నాసర్ (Nayel Nassar). జెన్నిఫర్ గేట్స్  వయసు 28 సంవత్సరాలు.

రోరీ గేట్స్ ఏం చేయబోతున్నాడు ?

బిల్ గేట్స్ కుమారుడు రోరీ గేట్స్ వయసు 25 ఏళ్లు. ఈయన కంప్యూటర్ సైన్స్, ఎకానమిక్స్‌లలో ఎంబీఏ చేశారు. తన తండ్రి వ్యాపారాలను భవిష్యత్తులో డీల్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఫోయెబ్ అడేల్ గేట్స్ ఏం చేస్తోంది ? 

బిల్‌గేట్స్ కుమార్తె ఫోయెబ్ అడేల్ గేట్స్(Bill Gates Children) వయసు 22 ఏళ్లు.  ఆమెకు మొదటి నుంచీ ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే ఇష్టం. ఫోయెబ్‌కు Phia పేరుతో ఒక ఫ్యాషన్ వెబ్‌‌సైట్ ఉంది. The Burnouts with Phoebe & Sophia అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో స్వయంగా ఫోయెబ్ పాల్గొంటారు.  

Also Read : Trump Vs Buffet: ట్రంప్ దెబ్బకు మార్కెట్లు డౌన్.. బఫెట్ సంపద అప్.. ఎలా ?