Bill Gates Regret : తన మాజీ భార్య మెలిండాకు విడాకులు ఇచ్చినందుకు పశ్చాత్తాపంగా ఫీల్ అవుతున్నానని మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. తాను పశ్చాత్తాపపడే తప్పులలో అది కూడా ఒకటని ఆయన అంగీకరించారు. ‘‘నేను గతంలో చాలా తప్పులు చేశాను. అయితే వాటితో ఈ తప్పును పోల్చలేను’’ అని బిల్ గేట్స్ తెలిపారు. తాజాగా టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Google Doodle : రిపబ్లిక్ డే వేళ గూగుల్ ప్రత్యేక డూడుల్.. జంతుజాలంతో పరేడ్
నా అతిపెద్ద వైఫల్యాల జాబితాలో మొదటిస్థానం
‘‘నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. అయితే మెలిండా నుంచి విడాకులు తీసుకోవడం ద్వారా చేసిన తప్పు గురించి చాలా చింతిస్తున్నాను. మెలిండా నుంచి విడాకులు అనే అంశం నా అతిపెద్ద వైఫల్యాల జాబితాలో మొదటిస్థానంలో ఉంటుంది’’ అని బిల్ గేట్స్ తెలిపారు. విడాకుల విషయం తనకు, మెలిండాకు కనీసం రెండేళ్లపాటు నరకయాతనలా కనిపించిందన్నారు. ‘‘మెలిండా, నేను ఇప్పటికీ ఒక కుటుంబంలా కలిసి సమయాన్ని గడుపుతున్నాం. మాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీ ఈవెంట్స్ జరిగినప్పుడు కలుస్తుంటాం’’ అని బిల్‌గేట్స్ చెప్పుకొచ్చారు. ‘‘ మా పిల్లలు బాగా పని చేస్తున్నారు. వారికి బలమైన విలువలు ఉన్నాయి’’ అని ఆయన తెలిపారు.
విడాకులకు కారణం ఇదీ..
బిల్ గేట్స్, మెలిండాలకు (Bill Gates Regret) జెన్నిఫర్ (28), రోరీ (25), ఫోబ్ (22) అనే సంతానం ఉన్నారు. ఈ దంపతులు 2021 మే నెలలో విడాకులు తీసుకున్నారు. వాస్తవానికి విడాకులు మంజూరైన ఈ తేదీకి ఏడాది ముందు నుంచే వారిద్దరూ దూరంగా జీవిస్తున్నారు. ఒక మైక్రోసాఫ్ట్ ఉద్యోగితో బిల్ గేట్స్‌కు అఫైర్ ఉండటాన్ని మెలిండా గుర్తించారు. దీనిపై ఆమె గేట్స్‌ను నిలదీశారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే వ్యక్తి యువతులు, చిన్నారులతో నిర్వహించే రేవ్ పార్టీలలో బిల్ గేట్స్ పాల్గొన్నారని తెలిసి మెలిండ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ నాటి నుంచి ఆమె బిల్ గేట్స్‌కు దూరంగా ఉంటున్నారు. తదుపరిగా విడాకులు తీసుకున్నారు.
Also Read :Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాలో టాలీవుడ్ ఫేమస్ యాక్టర్ సందడి
ఒరాకిల్ మాజీ సీఈఓ భార్యతో బిల్‌గేట్స్..
69 ఏళ్ళ వయసులో బిల్ గేట్స్ ఇప్పుడు ఒరాకిల్ మాజీ సీఈఓ మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్‌తో డేటింగ్ చేస్తున్నారు. పౌలా హర్డ్ ఇద్దరు పిల్లల తల్లి. వీరిద్దరూ కలిసి తొలిసారిగా 2024 ఏప్రిల్‌లో అందరి ఎదుట కనిపించారు.
ఫిలిప్ వాన్‌తో మెలిండా డేటింగ్..
మెలిండా విషయానికొస్తే. ఆమె ఫిలిప్ వాన్‌తో డేటింగ్ చేస్తున్నారు. ఫిలిప్ మైక్రోసాఫ్ట్‌లో దాదాపు తొమ్మిదేళ్లు ప్రోగ్రామర్‌గా పనిచేశారు. క్రాఫ్ట్ బీర్ డెలివరీ కంపెనీ ‘టావౌర్’ను ఆయన 2011లో ప్రారంభించారు.