రిలయన్స్ జియో (JIo) వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇటీవల రెండు ప్రీపెయిడ్ డేటా ప్లాన్‌ల వ్యాలిడిటీని తగ్గించినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ఎక్కువ కాలపరిమితి ఉన్న రూ.69, రూ.139 ప్లాన్‌లను ఇకపై కేవలం 7 రోజులకు పరిమితం చేయనుంది. ఈ మార్పు యూజర్లపై డేటా వినియోగ ఖర్చును పెంచే అవకాశముంది. ఇప్పటి వరకు ఈ ప్లాన్‌ల వ్యాలిడిటీ, వినియోగదారుడి బేస్ ప్లాన్ గడువు వరకు ఉండేది. అయితే, కొత్త నిబంధనల ప్రకారం, రూ.69 ప్లాన్‌తో 6GB డేటా, రూ.139 ప్లాన్‌తో 12GB డేటా పొందినప్పటికీ, అవి కేవలం వారం రోజులే పనిచేయనున్నాయి. దీని వల్ల ముఖ్యంగా ఎక్కువ డేటా వినియోగించే యూజర్లు ప్రతీ వారం కొత్త రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
Araku Festival : అరకు ఉత్సవాల్లో పాట పాడిన IAS అధికారి
అటు, ఇటీవల జియో తొలగించిన రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడం కొంతమందికి ఊరట కలిగించే విషయంగా మారింది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో, 2GB డేటా, అపరిమిత కాల్స్, 300 SMSలతో వస్తోంది. ఎక్కువ కాలపరిమితి ఉన్న ఈ ప్లాన్‌ను తిరిగి ప్రవేశపెట్టడం సాధారణ వినియోగదారులకు ఉపయుక్తంగా మారనుంది. యూజర్లు ఈ మార్పులను స్వాగతించాలా, లేక ఖర్చు పెరిగినట్లు భావించాలా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తక్కువ కాలపరిమితి ఉన్న డేటా ప్లాన్‌లు వినియోగదారులపై ఆర్థిక భారం పెంచే అవకాశముండగా, రూ.189 ప్లాన్ పునరుద్ధరణ కొంతవరకు ఉపశమనాన్ని కలిగించవచ్చు.