పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) తమ కస్టమర్లకు కస్టమర్ కై యోర్ కస్టమర్ (KYC) వివరాలను తక్షణమే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. కస్టమర్లు తమ ఖాతాలను యాక్టివ్‌గా కొనసాగించాలంటే KYC ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి అని పేర్కొంది. జనవరి 23వ తేదీ క KYC చేయించుకోవాలని , ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతా పనిచేయదని హెచ్చరించింది.
KYC అప్‌డేట్ చేయడానికి బ్యాంకు నిర్దేశించిన కొన్ని కీలక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు లేదా విద్యుత్ బిల్లు వంటి గుర్తింపు పత్రాలు ఉంటాయి. ఈ పత్రాలను బ్యాంక్ శాఖలో సమర్పించి, మీ వివరాలను బ్యాంకు అధికారులకు పరిశీలన కోసం అందించాలి.
Saif Ali Khan: ఆస్ప్రతి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్
అప్‌డేట్ ప్రక్రియ ఎలా చేయాలి?
KYC ప్రక్రియను చేయడం చాలా సులభం. మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగంలో ఉంటే, ఆన్‌లైన్ ద్వారా KYC వివరాలను సమర్పించవచ్చు. లేకపోతే, నేరుగా మీకు సమీపంలోని బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి, అవసరమైన పత్రాలతో KYC అప్డేట్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఈ క్రమంలో PNB బ్యాంకు తమ కస్టమర్లకు అవగాహన కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఖాతాదారులు ఇబ్బందులను ఎదుర్కోకుండా ముందుగానే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని, KYC అప్‌డేట్ పూర్తి చేయడం మంచిదని బ్యాంకు సూచించింది. ఇది కేవలం మీ ఖాతా సురక్షితంగా ఉండటానికి మాత్రమే కాకుండా, అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవడానికి అవసరం అని తెలిపింది.