Amazon Prime Day : అమెజాన్ ప్రైమ్‌డే సేల్స్ ఈనెల 20, 21 తేదీల్లో జరగనున్నాయి. ఇందులో భాగంగా భారీ ఆఫర్లతో వివిధ ఉపకరణాలను విక్రయించేందుకు అమెజాన్(Amazon Prime Day) సిద్ధమైంది. ఈసందర్భంగా కంప్యూటర్ విడిభాగాలు, హెడ్‌ఫోన్లపై 75% వరకు రాయితీ లభించనుంది. ల్యాప్‌టాప్‌లపై రూ.45000 వరకు, ట్యాబ్‌లపై 60 శాతం వరకు రాయితీ(Prime Day 2024) ఇస్తారు. సోనీ, శామ్‌సంగ్, ఎల్‌జీ, రెడ్‌మీ, హైసెన్స్, వీయూ, టీసీఎల్, ఏసర్ వంటి బ్రాండ్ల టీవీలపై 65% వరకు డిస్కౌంట్ లభించనుంది. వాషింగ్‌మెషీన్లపై 60 శాతం వరకు, ఏసీలు- రిఫ్రిజరేటర్లు-డిష్‌వాషర్లపై 55 శాతం వరకు రాయితీ ఇస్తారు.
We’re now on WhatsApp. Click to Join
- చిమ్నీలపై 65% వరకు రాయితీ ఇస్తారు.
- ఫ్యాషన్-బ్యూటీ ఉత్పత్తులపై 50-80% వరకు రాయితీ ఉంటుంది.
- ఫాసిల్-ఆర్మనీ వంటి ప్రీమియం వాచీలపై 50% వరకు రాయితీ ఇస్తారు.
- హీటర్లు-గ్రైండర్లు-వ్యాక్యూమ్ క్లీనర్లపై 35 శాతం వరకు రాయితీ ఇస్తారు.
- పరుపులు-ఫర్నీచర్‌పై 50% రాయితీ
- పుస్తకాలు-స్టేషనరీపై 50-70% రాయితీ
- సీపీ ప్లస్ 2 ఎంపీ సెక్యూరిటీ కెమేరా రూ.1000లోపే విక్రయిస్తారు.
- శామ్‌సంగ్ గెలాక్సీ ఎం35, ఐక్యూఓఓ జడ్9 లైట్, మోటరోలా 50 అల్ట్రా, లావా బ్లేజ్ ఎక్స్ వంటి 5జీ స్మార్ట్‌ఫోన్లను ఈనెల 20, 21 తేదీల్లో రిలీజ్ చేస్తారు.
- రెడ్‌మీ 13, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్, రియల్‌మీ జీటీ 6టీ ఫోన్ల కొత్త వేరియంట్లు రిలీజ్ అవుతాయి.
- ఐఫోన్ 13 రూ.47,999, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఏఐ ఫోన్ రూ.74,999, వన్‌ప్లస్ 12 ఫోన్ రూ.52,999కు లభిస్తాయి.
- షావోమీ ఫోన్లు రూ.7699 నుంచి, రియల్‌మీ రూ.7499 నుంచి, వివో రూ.7249 నుంచి, పోకో రూ.6499 నుంచి అందుబాటులో ఉంటాయి.
- ఐసీఐసీఐ డెబిట్-క్రెడిట్ కార్డులు, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో చెల్లింపులపై 10% పొదుపు చేయొచ్చని వివరించింది. వడ్డీలేని సులభ వాయిదాలతో పాటు పాత వస్తువులను మార్పిడి చేసుకోవచ్చనీ ప్రకటించింది.
Also Read :Gopadma Vrata : ఇవాళ వాసుదేవ ద్వాదశి.. గోపద్మ వ్రతం గురించి తెలుసా ?
బీ అలర్ట్.. ఇది గుర్తుంచుకోండి
అమెజాన్ ప్రైమ్ డే సేల్ నేపథ్యంలో అమెజాన్ తరహాలోనే కనిపించే నకిలీ వెబ్‌సైట్లకు దూరంగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను కూడా గుడ్డిగా క్లిక్ చేయొద్దని కోరుతున్నారు. ఈమెయిళ్లు, ఫోన్ కాల్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అమెజాన్‌ను పోలిన దాదాపు 1,230 కొత్త వెబ్‌సైట్లు ఇటీవలే పుట్టుకొచ్చాయని తెలిపింది. వీటిలో చాలావరకు మోసపూరిత ఉద్దేశంతోనే సృష్టించినవిగా గుర్తించినట్లు అనుమానం వ్యక్తంచేసింది.