Bank Holidays in October 2024 : నెల మారుతుందంటే సామాన్య ప్రజల్లోనే కాదు బ్యాంకు ఖాతాదారుల్లో (Bank Customers) కొత్త టెన్షన్. సామాన్య ప్రజలు గ్యాస్ ధర (Gas Price) ఎంత పెరుగుతుందో అని..వంట సామాన్ల ధరలు ఎలా ఉండబోతున్నాయో అని , పెట్రోల్ ధరలు (Petrol Price) తగ్గుతాయా..పెరుగుతాయా..అని ఎదురుచూస్తుంటారు. ఇక బ్యాంకు ఖాతాదారులు కొత్తగా ఏ రూల్స్ వస్తాయో..బ్యాంకు టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయో..అనేది చూస్తుంటారు.
ఇప్పుడు కూడా అలాగే ఎదురుచూస్తున్నారు. మరో మూడు రోజుల్లో అక్టోబర్ (October 2024) నెల రాబోతుంది. ఈ తరుణంలో అక్టోబర్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు పనిచేస్తున్నాయి..ఏ ఏ రోజు బ్యాంకులకు సెలవులు అనేది తెలుసుకునే పనిపడ్డారు. ఇక వచ్చే నెలలో బ్యాంకులకు ఏకంగా 14 రోజులు సెలవులు రాబోతున్నాయి. అవి ఎప్పుడెప్పుడు రాబోతున్నాయో చూద్దాం.
అక్టోబర్ 2 గాంధీ జయంతి
అక్టోబర్ 3న దసరా ప్రారంభం
అక్టోబర్ 6న ఆదివారం
అక్టోబర్ 10న మహా సప్తమి
అక్టోబర్ 11న మహా నవమి
అక్టోబర్ 12న విజయదశమి
అక్టోబర్ 13న ఆదివారం
అక్టోబర్ 17న మహర్షి వాల్మీకి జయంతి
అక్టోబర్ 20న ఆదివారం
అక్టోబర్ 26న బ్యాంకుల మూసివేత
అక్టోబర్ 27న ఆదివారం
అక్టోబర్ 29న దీపావళి
అక్టోబర్ 30న ఐచ్చిక సెలవు దినం
అక్టోబర్ 31న నరక చతుర్దశి
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 7 రోజులే.. అక్టోబర్ 2, 10, 11, 12, 13, 26, 27 తేదీలు సెలవు దినాలుగా అధికారులు ప్రకటించారు.
Read Also : Kanpur Test: కాన్పూర్ టెస్ట్ రద్దు అయితే టీమిండియాకు భారీ నష్టం