Bank Holidays : బ్యాంకులకు సెప్టెంబరు నెలలో కొన్ని సెలవులు ఉన్నాయి. వాటి గురించి మనకు ముందే క్లారిటీ ఉంటే సమయం వేస్ట్ కాకుండా వర్క్‌ను, ఫైనాన్షియల్ యాక్టివిటీస్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. ఇంతకీ వచ్చే నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయి ? మొత్తం 14 రోజుల సెలవుల వివరాలేంటి ? వీటిలో పబ్లిక్ సెలవులు ఎన్ని ? ప్రాంతీయ సెలవులు ఎన్ని ? రెండో, నాలుగో శనివారాలు ఎన్ని ? అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన జాబితా ప్రకారం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- సెప్టెంబరు 5 : శ్రీమంత శంకరదేవుడి తిథి (అసోంలో బ్యాంకులకు సెలవు)
- సెప్టెంబరు 7 : వినాయక చవితి
- సెప్టెంబరు 8 : ఆదివారం
- సెప్టెంబరు 13 : రామ్‌దేవ్ జయంతి (రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు)
- సెప్టెంబరు 14 : రెండో శనివారం
- సెప్టెంబరు 15 : ఆదివారం
- సెప్టెంబరు 16 : మీలాదున్ నబీ
- సెప్టెంబరు 17 : ఇంద్ర జాత్ర (సిక్కింలో బ్యాంకులకు సెలవు)
- సెప్టెంబరు 18 : శ్రీ నారాయణగురు జయంతి (కేరళలో బ్యాంకులకు సెలవు)
- సెప్టెంబరు 21: శ్రీ నారాయణగురు సమాధి (కేరళలో బ్యాంకులకు సెలవు)
- సెప్టెంబరు 22 : ఆదివారం
- సెప్టెంబరు 23 : బలిదాన్ డే (హర్యానాలో బ్యాంకులకు సెలవు)
- సెప్టెంబరు 28 : నాలుగో శనివారం
- సెప్టెంబరు 29 : ఆదివారం
Also Read :Gaddam Prasad : స్పీకర్ గడ్డం ప్రసాద్ ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్ !
‘మాన్‌సూన్ ధమాకా’
- బ్యాంక్ ఆఫ్ బరోడా ‘మాన్‌సూన్ ధమాకా’ పేరుతో రెండు కొత్త డిపాజిట్ పథకాలను తీసుకొచ్చింది. వీటిలో భాగంగా 333 రోజుల కోసం చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు సంవత్సరానికి 7.15 శాతం చొప్పున వార్షిక వడ్డీని చెల్లిస్తారు. సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.65% చొప్పున వడ్డీ ఇస్తారు.
- మరో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను 399 రోజుల కోసం చేసుకోవచ్చు. దీని ద్వారా 7.25 శాతం చొప్పున వార్షిక వడ్డీని చెల్లించవచ్చు. సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.75 శాతం చొప్పున వడ్డీ ఇస్తారు.
- సాధారణంగానైతే బ్యాంక్ ఆఫ్ బరోడా 90 రోజుల కోసం చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 5.50 శాతం వడ్డీని చెల్లిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీ వస్తుంది. 91 రోజుల నుంచి 180 రోజులు వరకు చేసే ఎఫ్‌డీకి 5.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.10 శాతం వడ్డీని ఇస్తుంది. 181 రోజుల నుంచి 210 రోజుల వరకు చేసే ఎఫ్‌డీకి 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీని అందిస్తుంది. 211 రోజుల నుంచి 270 రోజుల వరకు చేసే ఎఫ్‌డీకి 6.15 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.65 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తుంది.