Site icon HashtagU Telugu

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

Bank

Bank

Bank Holidays: నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది. దుర్గా పూజ, ఇతర పండుగల కారణంగా బ్యాంకులు సెలవులు (Bank Holidays) ప్రకటించాయి. అలాగే అక్టోబర్ నెలలో దసరా, దీపావళి, ఛట్ పూజ, భాయ్ దూజ్ వంటి ప్రధాన పండుగలు రానున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జాతీయ సెలవుదినం ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని బ్యాంకులు సెలవులు ప్రకటించాయి. అయితే ప్రతి రాష్ట్రంలో సెలవులు వేర్వేరు రోజుల్లో ఉండవచ్చు అనే విషయాన్ని బ్యాంక్ కస్టమర్లు గమనించాలి. కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే వినియోగదారులు తమ రాష్ట్రంలో ఉన్న సెలవుల జాబితాను తప్పకుండా చూసుకోవాలి.

దుర్గా పూజ సెలవులు

కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ అంతటా మహాసప్తమి నుండి సెలవులు ప్రారంభమవుతున్నాయి. ఇవి వరుసగా 6 రోజుల పాటు కొనసాగుతాయి.

Also Read: IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్.. టాస్ గెలిచిన వారికే ట్రోఫీనా?

కేరళలో సెప్టెంబర్ 30న బ్యాంకులు మూసివేత

నవరాత్రి సందర్భంగా సెప్టెంబర్ 30న బ్యాంకులకు సెలవు ఉంటుందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల వారికి మూడు రోజుల సుదీర్ఘ సెలవు వస్తుంది. అక్టోబర్ 1, మహానవమి సందర్భంగా బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మేఘాలయ, నాగాలాండ్, ఒడిశా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లో సెలవు ఉంటుంది. అలాగే, అక్టోబర్ 2న జాతీయ సెలవు ఉంటుంది.

అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఉన్న రోజులు

Exit mobile version