Bank Holiday: డిసెంబర్ 31వ తేదీతో 2025 సంవత్సరం ముగియనుంది. రేపటి నుండి కొత్త ఏడాది 2026 ప్రారంభం కాబోతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా సెలవులు ఉంటాయనే ఉద్దేశంతో జనవరి 1న బ్యాంకులు తెరిచి ఉంటాయా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఒకవేళ మీరు రేపు బ్యాంకు పనుల కోసం బయటకు వెళ్లాలనుకుంటే ఈ సమాచారాన్ని తప్పక చదవండి:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. జనవరి 1న దేశంలోని అన్ని నగరాల్లో బ్యాంకులు బంద్ ఉండవు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సెలవు ప్రకటించారు.
సెలవు ఉన్న నగరాలు ఇవే
ఆర్బీఐ నిబంధనల ప్రకారం రేపు (జనవరి 1) కింది నగరాల్లో బ్యాంకులు పనిచేయవు.
- ఐజ్వాల్
- చెన్నై
- గ్యాంగ్‌టక్
- ఇంఫాల్
- ఇటానగర్
- కోహిమా
- కోల్‌కతా
- షిల్లాంగ్
ఈ నగరాలు మినహా దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, దేశ రాజధాని ఢిల్లీలో కూడా రేపు బ్యాంకులు తెరిచే ఉంటాయి. సాధారణ పని దినంలాగే లావాదేవీలు కొనసాగుతాయి.
Also Read: ఐపీఎల్ 2026.. ముస్తాఫిజుర్ రెహమాన్‌పై బీసీసీఐ నిషేధం విధించబోతుందా?
ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి
బ్యాంక్ బ్రాంచ్‌లకు సెలవు ఉన్న నగరాల్లో కూడా డిజిటల్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. కింది సేవలు యథావిధిగా కొనసాగుతాయి.
ఆన్‌లైన్ బ్యాంకింగ్: ఫండ్ ట్రాన్స్‌ఫర్ (IMPS, NEFT, RTGS), బిల్ పేమెంట్స్ వంటివి ఇంటి నుండే చేసుకోవచ్చు.
ATM సేవలు: నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి.
కార్డ్ సేవలు: డెబిట్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు యథావిధిగా పనిచేస్తాయి.
గమనిక: నేరుగా బ్యాంకుకు వెళ్లి చేయాల్సిన పనులు (నగదు జమ, చెక్కుల క్లియరెన్స్ వంటివి) సెలవు ఉన్న నగరాల్లో రేపు జరగవు. కాబట్టి మీ నగరంలో సెలవు ఉందో లేదో చూసుకుని మీ పనులను ప్లాన్ చేసుకోండి.
