Bank: తొమ్మిదవ సిక్కు గురువు అయిన గురు తేగ్ బహదూర్ సాహిబ్ 350వ జయంతిని పురస్కరించుకుని అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు మంగళవారం ప్రభుత్వ సెలవుదినాన్ని ప్రకటించాయి. కొద్ది రోజుల క్రితం యూపీ ప్రభుత్వం గురు తేగ్ బహదూర్ సాహిబ్ 350వ జయంతి సెలవును నవంబర్ 24 నుండి నవంబర్ 25కి మార్చింది. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ‘X’ (గతంలో ట్విట్టర్)లో సెలవు ప్రకటిస్తూ గురు సాహిబ్ ధైర్యం, దయ, మత స్వేచ్ఛ శాశ్వత సందేశం మన భవిష్యత్తు ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేసి, స్ఫూర్తిని ఇస్తుందని అన్నారు.
అందువల్ల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ- ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఇతర సంస్థలు నవంబర్ 25, 2025న మూసివేయబడతాయి. దీంతో ఈ రోజున బ్యాంకులు (Bank) కూడా మూసి ఉంటాయా అని చాలా మంది వినియోగదారులు సందేహిస్తున్నారు. మంగళవారం భారతీయ నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా లేదా అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Also Read: IND vs SA: భారత్‌కు సౌతాఫ్రికా ఫాలో-ఆన్ ఎందుకు ఇవ్వలేదు?
రేపు బ్యాంకులు మూసి ఉంటాయా?
నవంబర్ 25న బ్యాంకులు మూసి ఉంటాయా లేదా అనే విషయంలో చాలా మందికి గందరగోళం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ సెలవుల షెడ్యూల్ ప్రకారం.. మంగళవారం నాడు అన్ని బ్యాంకులు అవి ప్రభుత్వమైనా, ప్రైవేట్ అయినా తెరిచే ఉంటాయి. అయితే నవంబర్ 25న యూపీ, ఢిల్లీలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు మూసి ఉన్నప్పటికీ బ్యాంకులు మాత్రం తెరిచే ఉంటాయి. తమ బ్యాంకింగ్ సంబంధిత పనులను పూర్తి చేసుకోవడానికి, వినియోగదారులు తమకు దగ్గరలోని బ్రాంచ్‌ను సందర్శించవచ్చు. ఈ విధంగా బ్యాంకులు యధావిధిగా పని చేస్తూనే ఉంటాయి.
దేశ రాజధానిలో ఏవి తెరిచి ఉంటాయి? ఏవి మూసి ఉంటాయి?
పీటీఐ (PTI) ప్రకారం.. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మంగళవారం మూసి ఉంటాయి. ప్రైవేట్ పాఠశాలలు, అన్ని ప్రభుత్వ పాఠశాలలు మూసి ఉంటాయి. ఢిల్లీలో బస్సులు, టాక్సీలు, మెట్రో అన్నీ నడుస్తాయి. వినియోగదారులు సాధారణ కార్యకలాపాలను ఆశించవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రులు, అత్యవసర సేవలు వారి సాధారణ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయి.
