Baba Ramdev : యోగా గురువు బాబా రాందేవ్ మరో సరికొత్త జిహాద్‌ను తెరపైకి తెచ్చారు. అదే.. ‘షర్బత్ జిహాద్’. ముస్లిం వర్గానికి చెందిన ఒక కంపెనీ తయారు చేసే షర్బత్‌కు ఏటా వేసవిలో భారీ డిమాండ్ ఉంటుంది. దాని సేల్స్ కూడా జోరుగా జరుగుతుంటాయి. గులాబీ రంగులో ఆ షర్బత్ ఉంటుంది. దాని గురించి ప్రస్తావిస్తూ బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘షర్బత్ జిహాద్ ఇది. మరుగుదొడ్లను శుభ్రం చేసే విషాన్ని కూల్‌డ్రింక్స్ పేరుతో అమ్ముతున్నారు. దాని నుంచి మీ కుటుంబాన్ని, అమాయకులైన పిల్లలను కాపాడండి. పతంజలి షర్బత్, జ్యూస్‌లను మాత్రమే ఇంటికి తీసుకెళ్లండి’’ అని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు.
We got “Sharbat Jihad” before GTA VI 💀😭 pic.twitter.com/qIuLrkhJxe
— Yash Tiwari (@DrYashTiwari) April 9, 2025
Also Read :Shock To Masood Azhar: పాపం పండుతోంది.. ఉగ్రవాది మసూద్ అజర్ సన్నిహితుడి మర్డర్
ఇది తాగితే.. మందిరాలు, వేద పాఠశాలలను నిర్మిస్తాం
ముస్లిం వర్గం తయారు చేసే ఆ గులాబీ రంగు షర్బత్‌ను ఎగబడి తాగితే.. ఆ డబ్బులతో మసీదులు, మదర్సాలు నిర్మిస్తారని రాందేవ్(Baba Ramdev) కామెంట్ చేశారు. దాని కంటే హై క్వాలిటీతో బాదం, అక్రోట్ వంటివన్నీ కలిపి తాము తయారు చేసిన పతంజలి రోజ్ షర్బత్‌ను తాగితే.. మందిరాలు, వేద పాఠశాలలను నిర్మిస్తామని యోగా గురువు చెప్పుకొచ్చారు. ‘‘లవ్ జిహాద్, ఓట్ జిహాద్‌ల మాదిరే ఈ షర్బత్ జిహాద్ సమాజాన్ని నాశనం చేస్తుంది. పతంజలి రోజ్ షర్బత్ తాగితే అది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది’’ అని ఆయన తెలిపారు.
Also Read :Tahawwur Rana: కాసేపట్లో భారత్‌కు తహవ్వుర్ రాణా.. ఆ జైలులో ఏర్పాట్లు
రూహ్ అఫ్జాపై పరోక్ష విమర్శలు
హమ్‌దర్ద్ కంపెనీ రూహ్ అఫ్జాపైనే రాందేవ్ బాబా ఈ పరోక్ష విమర్శలు చేశారని నెటిజన్లు అంటున్నారు. మొత్తం మీద బాబా రాందేవ్ వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరకు షర్బత్‌పైనా మతపరమైన ముద్ర వేసేందుకు ఆయన ప్రయత్నించడాన్ని అందరూ ఖండిస్తున్నారు. ఆహార పదార్థాలు, పానీయాలకూ మతం రంగును అద్దడం కరెక్టు కాదనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.