Site icon HashtagU Telugu

Ather Energy IPO: ఐపీఓకు ఏథర్‌ ఎనర్జీ.. రూ. 3100 కోట్లు ల‌క్ష్యం..!

Ather Energy IPO

Ather Energy IPO

Ather Energy IPO: ఓలా ఎలక్ట్రిక్ IPO అద్భుతమైన విజయం తర్వాత ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ కూడా తన పబ్లిక్ ఇష్యూని (Ather Energy IPO)మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఏథర్ ఎనర్జీ తన తాజా IPO రూ. 3100 కోట్లకు సంబంధించిన పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. దీంతో ఈవీ రంగంలో మరో శక్తివంతమైన కంపెనీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఓలా ఎలక్ట్రిక్ IPO లిస్టింగ్ నిదానంగా ఉన్నా కానీ ఆ తర్వాత వచ్చిన పెరుగుదల పెట్టుబడిదారుల డబ్బును రెట్టింపు చేసింది. ఇప్పుడు ఓలా ప్రత్యర్థి ఏథర్ ఎనర్జీ పనితీరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఏథర్ ఎనర్జీ IPO విలువ రూ. 3100 కోట్లు

ఏథర్ ఎనర్జీకి చెందిన రూ.3100 కోట్ల ఈ ఐపీఓ రాబోతోంది. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. ఈ IPO ద్వారా కంపెనీ 3100 కోట్ల రూపాయల తాజా ఇష్యూని, ఆఫర్ ఫర్ సేల్ అంటే OFS ద్వారా మార్కెట్లో 2.2 మిలియన్ షేర్లను విడుదల చేస్తుంది.

Also Read: North Korea Nuclear Weapons: అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచుతాం : ఉత్తర కొరియా నియంత కిమ్

అతిపెద్ద వాటాదారు హీరో మోటోకార్ప్ తన వాటాను విక్రయించదు

కొన్ని నివేదిక‌ల ప్రకారం.. కంపెనీ వ్యవస్థాపకుడు, CEO తరుణ్ సంజయ్ మెహతాతో పాటు అనేక ఇతర పెద్ద పెట్టుబడిదారులు తమ వాటాను తగ్గించుకుంటారు. సమాచారం ప్రకారం.. Ather Energy అతిపెద్ద వాటాదారు Hero MotoCorp ఈ IPOలో తన వాటాను తగ్గించుకోవడం లేదు. ఏథర్ ఎనర్జీలో కంపెనీకి 37.2 శాతం వాటా ఉంది. ఓలా ఎలక్ట్రిక్ షేరు రూ.76గా నమోదైంది. సోమవారం రూ.114.58 వద్ద ముగిసింది.

మహారాష్ట్రలో కర్మాగారంతో పాటు పరిశోధన, అభివృద్ధికి నిధులు

ప్రస్తుతం దేశంలో ఈవీ మార్కెట్ ఆశించిన స్థాయిలో లేదు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ఈవీ మార్కెట్‌ను విస్తరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది. ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బుతో మహారాష్ట్రలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఏథర్ ఎనర్జీ తెలిపింది. ఈ డబ్బును పరిశోధన, అభివృద్ధి కోసం కూడా ఖర్చు చేస్తారు. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టం రూ.1,060 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం వరకు ఈ సంఖ్య రూ.864 కోట్లుగా ఉండేది.