Asias Richest Families : సంపన్నుల జాబితాలను విడుదల చేసే విషయంలో ‘బ్లూమ్‌బర్గ్’ చాలా ఫేమస్. తాజాగా ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్న కుటుంబాల వివరాలతో ఒక లిస్టును అది రిలీజ్ చేసింది. దీనిలో నంబర్ 1 స్థానంలో ఏ ఫ్యామిలీ నిలిచిందో తెలుసా ? మన ముకేశ్ అంబానీ కుటుంబం ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆయన కుటుంబానికి దాదాపు రూ.7.86 లక్షల కోట్ల సంపద ఉందని నివేదికలో వెల్లడించారు. ఈ లిస్టులో నాలుగో స్థానంలో మిస్త్రీ ఫ్యామిలీ ఉంది. ఏడో స్థానంలో జిందాల్ ఫ్యామిలీ ఉంది. తొమ్మిదో స్థానంలో బిర్లా ఫ్యామిలీ ఉంది. మొత్తం 20 సంపన్న కుటుంబాల వివరాలను ఈ జాబితాలో పొందుపరిచారు. ఇందులో మన దేశానికి చెందిన బజాజ్, హిందూజా కుటుంబాలకు(Asias Richest Families) కూడా చోటు దక్కింది.
Also Read :Delhi CM : ఢిల్లీ సీఎం రేసులో స్మృతీ ఇరానీ, బన్సూరీ స్వరాజ్.. ఎవరికో ఛాన్స్ ?
రెండో సంపన్న ఫ్యామిలీ
ఆసియాలోనే రెండో సంపన్న ఫ్యామిలీగా థాయ్‌లాండ్‌కు చెందిన చీరావనోండ్ కుటుంబం నిలిచింది. ఈ కుటుంబానికి రూ.3.70 లక్షల కోట్ల సంపద ఉంది. అంబానీ కుటుంబం సంపదలో సగానికన్నా తక్కువ సంపద చీరావనోండ్ కుటుంబానికి ఉంది.
- ఇండోనేషియాకు చెందిన హర్టోనో కుటుంబం మూడో సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ.3.66 లక్షల కోట్ల సంపద ఉంది.
- భారత్‌కు చెందిన మిస్త్రీ ఫ్యామిలీ నాలుగో సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ.3.25 లక్షల కోట్ల సంపద ఉంది.
- హాంకాంగ్‌కు చెందిన క్వాక్ ఫ్యామిలీ ఐదో సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ.3.09 లక్షల కోట్లు సంపద ఉంది.
- తైవాన్‌కు చెందిన త్సాయ్ కుటుంబం ఆరో సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ.2.68 లక్షల కోట్లు సంపద ఉంది.
- భారత్‌కు చెందిన జిందాల్ ఫ్యామిలీ ఏడో సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ. 2.44 లక్షల కోట్ల సంపద ఉంది.
- థాయ్‌లాండ్‌కు చెందిన యోవిధ్య కుటుంబం ఎనిమిదో సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ. 2.23 లక్షల కోట్ల సంపద ఉంది.
- భారత్‌కు చెందిన బిర్లా ఫ్యామిలీ తొమ్మిదో సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ. 1.99 లక్షల కోట్ల సంపద ఉంది.
- దక్షిణ కొరియాకు చెందిన లీ కుటుంబం పదో సంపన్న కుటుంబంగా నిలిచింది. దీని వద్ద రూ.1.97 లక్షల కోట్ల సంపద ఉంది.