Site icon HashtagU Telugu

Gold Jewellery: బంగారు నగలు అమ్మినా.. తాకట్టు పెట్టినా.. ఇవి తెలుసుకోండి

Sell Gold Jewelry Gold Jewellery Better Price Best Price

Gold Jewellery : బంగారం రేటు రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.90,623గా ఉంది. 22 క్యారెట్ల నగల బంగారం రేటు 10 గ్రాములకు రూ.83,083గా ఉంది. బంగారం ధరలు పెరిగితే భారతీయులు అందరికీ బాధ కలుగుతుంటుంది. ఎందుకంటే మన దేశంలో ప్రతీ శుభకార్యానికి బంగారు నగలను కొనుగోలు చేస్తుంటారు.  అయితే ఆర్థిక అవసరాలు, ఇతరత్రా అత్యవసరాలు వచ్చినప్పుడు కొంతమంది బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు. ఇంకొందరు బంగారాన్ని అమ్మేస్తుంటారు. ఇలాంటప్పుడు మన దగ్గరున్న గోల్డ్‌కు మెరుగైన రేటు రావాలంటే ఏం చేయాలో చూద్దాం..

Also Read :Phone Connections: జనాభా కంటే ఫోన్ కనెక్షన్లే ఎక్కువే.. ‘ల్యాండ్‌లైన్’ పతనం

ఇవి గుర్తుంచుకోండి..

బంగారాన్ని శరీరం నుంచి తీసి డైరెక్టుగా అమ్మేయకండి. వాటిని రాత్రి టైంలో సర్ఫ్ నీటిలో నానబెట్టి, మరుసటి రోజు తెల్లవారి మంచినీటితో కడగండి. వాటిని మెత్తటి గుడ్డతో తుడవండి. దీంతో ఆ నగలు కొత్తవాటిలా మెరుస్తాయి. ఆ తర్వాతే వాటిని అమ్మాలి.