భారత అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క (Anant Ambani’s dog) “హ్యాపీ” (Happy) తీవ్ర అనారోగ్యంతో ఏప్రిల్ 30, 2025న కన్నుమూసింది. ఈ వార్త అంబానీ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. హ్యాపీ తమ కుటుంబ సభ్యుడిలా మమకారంతో పెంచుకున్నామని, అది ఎప్పటికీ తమ హృదయాల్లో నిలిచిపోతుందని అంబానీ కుటుంబం హృదయపూర్వకంగా నివాళి అర్పించింది. సామాజిక మాధ్యమాల్లో కూడా హ్యాపీకి ప్రత్యేకంగా శ్రద్ధాంజలిలు అర్పిస్తున్నారు.
Covert Operation: హఫీజ్ సయీద్ అంతానికి కోవర్ట్ ఆపరేషన్ ? లాహోర్‌లో హైఅలర్ట్
గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన హ్యాపీ సాధారణ పెంపుడు జంతువు కాదు. అంబానీలకు ఇది కుటుంబ సభ్యుడి లాంటి ప్రేమను అందించేది. హ్యాపీ కోసం ప్రత్యేకంగా మెర్సిడెస్-బెంజ్ G400d SUV వంటి విలాసవంతమైన కారు కొనుగోలు చేయడం ద్వారా వారి ప్రేమను చాటారు. దాని విలువ దాదాపు రూ. 3 కోట్లు ఉంటుంది. అంతకుముందు హ్యాపీ టయోటా ఫార్చ్యూనర్, టయోటా వెల్ఫైర్ కార్లలో కూడా ప్రయాణించింది. హ్యాపీ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక దుస్తులు ధరించేది. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుకలో పింక్ కలర్ బనారసి జాకెట్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాంటి హ్యాపీ మరణం అంబానీ కుటుంబానికి తీరనిది. ఇది కేవలం ఒక కుక్క మరణం కాదు, ఒక కుటుంబంలోని ప్రియమైన సభ్యుడు చేజారిన బాధగా చెప్పవచ్చు.