భారతదేశంతో పాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుల్లో ప్రముఖలైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani)కి వాచ్ (Watch) లంటే ఎంత ఇష్టమో తెలియంది కాదు. మార్కెట్ లోకి కొత్త వాచ్ వస్తుందంటే ముందుగా ఆయన చూపు దానిమీదనే ఉంటుంది. వాచ్ ప్రత్యేకతలు ఏంటి..? ఎలా ఉంది..? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి..? ఇలా అన్నింటి పై అరా తీస్తారు. అది నచ్చితే చాలు దాని ఖరీదు ఎన్ని కోట్లు ఉన్న సరే ఏమాత్రం ఆలోచించకుండా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికే ఎన్నో కోట్ల రూపాయిలు పెట్టి కొనుగోలు చేసిన వాచ్ లు తన గ్యాలరీలో ఉన్నాయి. తాజాగా మరో సరికొత్త వాచ్ తన చేతికి చేరింది. దీని ఖరీదు అక్షరాలా రూ.22 కోట్లు. ఏంటి ధర చూసి షాక్ అవుతున్నారా..? సామాన్యులకు ఆ ధర వామ్మో అనిపించినా..అనంత్ అంబానీకి మాత్రం తక్కువే.
స్విట్జర్లాండ్‌లో తయారైన రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందిన RM 52-04 మోడల్ వాచ్(Richard Mille RM 52-04 Skull Blue Sapphire watch)ను ఆయన ధరించారు. ఈ వాచ్ ధర అక్షరాలా రూ. 22 కోట్లు కావడంతో ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ వాచ్ ప్రత్యేకత ఏమిటంటే.. పుర్రె ఆకారంతో కూడిన డయల్, స్కైబ్లూ కలర్ డిజైన్ ఆకట్టుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాచీలు కేవలం మూడు మాత్రమే ఉన్నట్లు సమాచారం. అత్యంత విలాసవంతమైన ఈ గడియారం అత్యుత్తమ నైపుణ్యంతో రూపొందించబడింది. ఈ వాచ్ ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకొని, ప్రపంచంలోని ఏ కష్టమర్ కోసం కాకుండా, ప్రత్యేకమైన వ్యక్తుల కోసం మాత్రమే తయారుచేస్తారు.
అంబానీ కుటుంబానికి చెందిన అత్యంత ఖరీదైన వస్తువులు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటాయి. ఈ వాచ్ కూడా అలాంటి ప్రత్యేకమైన వింటేజ్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ ధరకు వాచ్ కొనుగోలు చేయడం సాధారణ వ్యక్తికి అసాధ్యమైన విషయం. ఈ వాచ్‌ను తయారు చేసిన రిచర్డ్ మిల్లె సంస్థ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచీల తయారీలో నిపుణులుగా గుర్తింపు పొందింది. ప్రతి వాచ్ ప్రత్యేకమైన డిజైన్‌తో రూపొందించి, మార్కెట్లో అపరిమిత ప్రతిష్టను గుర్తింపు తెచ్చుకోవడం ఈ సంస్థ స్పెషల్.
Read Also : Formula E Race Case : నాపై ఇది ఆరో ప్రయత్నం: కేటీఆర్