Site icon HashtagU Telugu

AMGEN : హైదరాబాద్‌లో అమ్జెన్ ఇన్నోవేషన్ సైట్ ప్రారంభం

Amgen Innovation Site Launc

Amgen Innovation Site Launc

అమెరికాలోనే అతి పెద్ద బయోటెక్నాలజీ సంస్థ అయిన అమ్జెన్ (AMGEN) హైదరాబాద్‌లో తమ న్యూ టెక్నాలజీ, ఇన్నోవేషన్ సైట్ ను ప్రారంభించింది. హైటెక్ సిటీ (IT hub of Madhapur) సమీపంలోని అమ్జెన్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు (Minister Sridharbabu) పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో అమ్జెన్ చైర్మన్ & CEO రాబర్ట్ ఎ. బ్రాడ్‌వే, అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్, అమ్జెన్ ఇండియా ప్రతినిధి సోమ్ చటోపాధ్యాయ, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ గుల్లపల్లి వంటి ప్రముఖులు హాజరయ్యారు.

Somireddy Chandramohan Reddy : అందుకే వైఎస్‌ జగన్‌ అసెంబ్లీకి వచ్చారు..!

ఈ విస్తరణలో భాగంగా 2025 నాటికి అమ్జెన్ దాదాపు $200 మిలియన్లు (సుమారు రూ.1600 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఇది బయోఫార్మా రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలను అందించనుంది. అమ్జెన్ తమ ఔషధాల శ్రేణిని మరింత విస్తరించి, రాష్ట్రంలో కార్యకలాపాలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అలాగే, రాబోయే సంవత్సరాల్లో మరిన్ని పెట్టుబడులకు మార్గం సుగమం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Ponnam Prabhakar : 317 జీవో మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

ఈ కొత్త సైట్ ద్వారా ఏఐ (AI), డేటా సైన్స్, డిజిటల్ సామర్థ్యాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి. హైదరాబాద్‌కు ఇది మరో మెరుగైన పెట్టుబడి అవకాశంగా మారనుంది. అమ్జెన్ విస్తరణ రాష్ట్రంలో జీవసాస్త్ర పరిశోధన, బయోటెక్, ఫార్మా రంగాల అభివృద్ధికి తోడ్పడనుంది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ సృష్టికి ఎంతగానో ఉపయోగపడనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.