Amazon వారి ‘హాలీడే టాయ్ లిస్ట్’..

హస్­బ్రో, స్కిల్­మ్యాటిక్స్, ఇంకా మరెన్నో అందించే టాప్ బ్రాండ్లు మరియు కొత్త లాంచ్­ల పై 50% వరకు తగ్గింపును పొంది కస్టమర్లు ‘భారీ సేవింగ్స్’ను ఆనందించవచ్చు

Published By: HashtagU Telugu Desk
Amazon's 'holiday Toy List'

Amazon's 'holiday Toy List'

Amazon : తన హాలీడ్ టాయ్ లిస్ట్, యొక్క 8వ సంచికను అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఈ ఎడిషన్ 24 డిసెంబర్, 2024 వరకు షాపర్స్­కు ఆనందం కలిగించనున్నది. చక్కగా కూర్చిన ఈ స్టోర్­లో, 10,000లకు పైగా బ్రాండ్లకు చెందిన 1.6 మిలియన్­లకు పైగా బొమ్మలు మరియు గేమ్స్ విస్తృత సెలక్షన్ ప్రదర్శించబడుతుంది. ఈ బ్రాండ్లలో LEGO, హాట్ వీల్స్, నెర్ఫ్, హస్­బ్రో, స్కిల్­మాటిక్స్, బార్బీ, ఇంకా మరెన్నో ఉన్నాయి. కుటుంబాలు మరియు బహుమతులు ఇచ్చేవారి బహూకరించే అనుభవాన్ని మరింత గొప్పగా పెంచటం పై ఈ స్టోర్ దృష్టి కేంద్రీకరించింది. హాలీడే సీజన్­లో ప్రతి బహుమతిని, ఆనందాన్ని, ఐకమత్యాన్ని కలిగించి, మరపురాని ప్రత్యేకతగా ఈ స్టోర్ నిలుపుతుంది.

“Amazon.in పై ‘హాలీడే టాయ్ లిస్ట్’8వ సంచికను ప్రెజెంట్ చేయటం మాకు హర్షాతిరేకాలను కలిగిస్తోంది. ఇది మీరు బహూకరించాలనుకునే అన్ని వస్తువులను కనుగొనేందుకు నమ్మకమైన డెస్టినేషన్. సెలవురోజులు దగ్గరపడుతున్న కొద్దీ, సీజన్­లో మ్యాజిక్­ను మీ స్వంతం చేసుకునేందుకు ఫెస్టివ్ టాయ్స్­ మరియు గేమ్స్­ను హాల్స్­లో చేర్చుకునేందుకు ఇది అనువైన సమయం. హాలీ-డే ఇతివృత్తపు బోర్డ్ గేమ్స్ మొదలుకుని సృజనాత్మకమైన క్రాఫ్ట్­లు మరియు STEM యాక్టివిటీలతో, మేము జాగ్రత్తగా కూర్చిన సెలక్షన్, పిల్లలను మరియు పెద్దలను కూడా తప్పక ఆనందింపచేస్తుందని మేము విశ్వసిస్తున్నాము. మా బ్రాండ్ పార్ట్­నర్లు, ఉత్తమ-నాణ్యత కలిగిన టాయ్ మరియు గేమ్స్­ విస్తృత శ్రేణిని ఆఫర్ చేస్తున్నారు. తద్వారా అవిస్మరణీయమైన క్షణాలను సృష్టించేందుకు చక్కని అనువైన బహుమతులను మీరు కనుగొనగలిగేందుకు వీలు కలిగిస్తున్నారు. అమెజాన్ ఇండియాలో మేము, ప్రతి కొనుగోలును నిజంగా ప్రత్యేకమైన సెలవు సీజన్ చేసుకునే దిశలో ఒక అడుగుగా మారుస్తూ మీరు ఆస్వాదించే మధురక్షణాలను సృష్టించేందుకు దోహదం చేస్తుంటాము.” అని రాజర్షి గ్విన్, డైరెక్టర్, బుక్స్, టాయ్స్ & గేమ్స్, అమెజాన్ ఇండియా అన్నారు.

SBI మరియు ICICI అమెజాన్ పే కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు, వాటితో పాటు HDFC, IDFC, ఫెడరల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సౌత్ ఇండియన్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల*తో 10% వరకు తక్షణ డిస్కౌంటును కస్టమర్లు అన్-లాక్ చేసుకోగలుగుతారు.

Read Also: Indian Coast Guard : 78 మంది మత్స్యకారులతో రెండు బంగ్లాదేశ్ నౌకల్ని సీజ్‌ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్‌

  Last Updated: 10 Dec 2024, 09:32 PM IST