Site icon HashtagU Telugu

Amazon India : మహా కుంభ మేళాతో అమేజాన్ ఇండియా ఒప్పందం

Amazon India Ties Up With Maha Kumbh Mela To Provide Beds For Visitors With Boxes Made From Amazon

Amazon India Ties Up With Maha Kumbh Mela To Provide Beds For Visitors With Boxes Made From Amazon

Amazon India : ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే 2025 మహా కుంభ మేళాలో సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, వినూత్నమైన ఆలోచనతో సమస్యను నిర్వహించడానికి అమేజాన్ ఇండియా సిద్ధమైంది. జనవరి మరియు ఫిబ్రవరిలలో, లక్షలాది భక్తులు ఈ 45 రోజుల పండగ కోసం ప్రయాగ్ రాజ్, ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శిస్తారు. ఈ కార్యక్రమంలో జరిగే సమయంలో సౌకర్యవంతమైన విశ్రాంతి కోసం అమేజాన్ ఇండియా విలక్షణమైన చొరవను ప్రారంభించింది. దీనిలో భాగంగా తమ సిగ్నేచర్ కార్డ్ బోర్డ్ ప్యాకేజింగ్ బాక్స్ లను పొందికైన బెడ్స్ గా మారుస్తాయి. మేళాకు హాజరైన వారికి ఎన్నో గంటల సౌకర్యవంతమైన నిద్రను కలగచేస్తాయి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా వీటిని సందర్శకులకు ఉచితంగా అందచేస్తున్నారు.

మేళా జరిగే మైదానంలో కీలకమైన ప్రాంతాలను గుర్తించడానికి అమేజాన్ మహా కుంభ్ అధికారులతో సన్నిహితంగా పని చేసింది. ఇక్కడే అమేజాన్ బెడ్స్ ఎంతో అవసరమైన సౌకర్యాన్ని కేటాయిస్తాయి. ఈ బెడ్స్ లోని ప్రధానమైన భాగం లాస్ట్ అండ్ ఫౌండ్ కేంద్రానికి కేటాయించబడుతుంది. ఈ కేంద్రం అవసరమైన వారికి కేటాయిస్తుంది. కాగా కొన్ని సాధారణ ప్రజానీకం కోసం అందచేయబడతాయి. ఇంకా, ఈ బెడ్స్ లో కొన్ని కుంభ్ పోలీసు కర్మచారీస్ కోసం మరియు కుంభ్ ఆసుపత్రి కోసం కేటాయించబడతాయి. వివిధ అవసరాలను తీర్చడం మరియు మేళాలో సాధ్యమైనంత ఎక్కువమందికి వీటిని అందుబాటులో ఉంచడమే ఈ బాక్స్ ల లక్ష్యం.

“మేము సేవలు అందించే సమాజాల పైన సానుకూలంగా ప్రభావం చూపించడానికి మా మిషన్ కు కీలకంగా మేము అమేజాన్ ఇండియాలో వినూత్నతను చేపట్టాము. ఈ నిబద్ధత నుండే మహా కుంభ్ మేళాతో మా సంబంధం ఉద్భవించింది. నమ్మకమైన సేవకు చిహ్నంగా లక్షలాదిమంది విశ్వసించిన మా దిగ్గజ అమేజాన్ బాక్స్ ల ద్వారా మా కస్టమర్లకు రోజూ సౌకర్యం, సదుపాయం మరియు సంరక్షణ అందించడానికి కృషి చేస్తున్నాం. ఈ బాక్స్ లను బెడ్స్ గా మార్చడం ద్వారా, కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం నిజమైన అవసరాన్ని పరిష్కరించడానికి మేము ఒక అవకాశం చూసాము. ఇది వినూత్నంగా ఆలోచించడమే కాకుండా – స్పష్టమైన తేడాను తీసుకురావడానికి బాక్స్ ను మార్చడం గురించి” అని ప్రజ్ఞ శర్మ, మార్కెటింగ్ డైరెక్టర్, అమేజాన్ ఇండియా అన్నారు.

ఈ వినూత్నమైన మరియు దృఢమైన బెడ్స్ అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన ఫ్యాబ్రికేటర్స్ జట్టుతో పని చేసిన తమ సృజనాత్మకమైన భాగస్వామిగా ఒగిల్వితో కలిసి అమేజాన్ ఇండియా పని చేసింది. భద్రతను నిర్థారించడానికి, నిపుణుల బృందం బాక్స్ లకు స్థానిక వాతావరణంలో ఒత్తిడి, అరుగుదల పరీక్షలు చేసారు.

“భారతదేశం వ్యాప్తంగా ఆనందం, ప్రేమ, సౌలభ్యం అందచేయడంలో అమేజాన్ మారు పేరుగా నిలిచింది. అమేజాన్ బాక్స్ – బెడ్స్ తో సందర్శకుల జీవితాలకు సౌలభ్యం కలిగించడానికి మహా కుంభ్ లో, మేము సౌకర్యం అందిస్తున్నాము. మహా కుంభ్ లో రాత్రి వేల ఎంతో చల్లగా ఉంటుంది మరియు మా ప్రత్యేకమైన యాక్టివేషన్ టీమ్ తో సన్నిహితంగా ఒగిల్వితో కలిసి పని చేస్తున్న మేము ఈ సమస్యను వినూత్నమైన పరిష్కారంతో నిర్వహించాలని నిర్ణయించాము. అమేజాన్ వారి ప్రసిద్ధి చెందిన కార్డ్ బోర్డ్ ప్యాకేజింగ్ బాక్స్ లు అప్ సైకిల్ చేయబడ్డాయి, పొరలుగా నొక్కి వేయబడ్డాయి మరియు బలమైన, సౌకర్యవంతమైన బెడ్స్ ను తయారు చేయడానికి పునః రూపొందించబడ్డాయి.” అని సుఖేష్ నాయక్, ఛీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ –ఒగిల్వి ఇండియా అన్నారు. కార్యక్రమం ముగిసిన తరువాత, అమేజాన్ ఇండియా నిరుపయోగ బెడ్స్ ను బాధ్యతాయుతంగా నాశనం చేస్తుంది. కాగా ఉపయోగించదగిన బెడ్స్ ను నగరంలోని ఎన్జీఓలకు దానం చేస్తుంది.

Read Also:  BJP MP Raghunandan Rao Arrest : బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు అరెస్ట్