Amazon India : అమేజాన్ ఇండియా తమ ప్రారంభోత్సవపు బ్లాక్ ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రకటించింది, నవంబర్ 29 నుండి డిసెంబర్ 2 వరకు ఇది కొనసాగుతుంది. అంతర్జాతీయంగా భారీగా సంబరం చేసుకోబడే, అమేజాన్ ఇండియా వారి మొదటి బ్లాక్ ఫ్రై కార్యక్రమం యాపిల్, శామ్ సంగ్, సోనీ, నైక్, కాల్విన్ క్లీన్, ఆడిడాస్, టమ్మీ హిల్ ఫిగర్, పనసోనిక్, జీన్ పాల్, డాబర్, ఎల్జీ, అల్డో, స్వరోవ్ స్కి సహా బ్రాండ్స్ మరియు ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ శ్రేణులు పై డీల్స్ ను అందిస్తోంది.
“అమేజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2024 సాధించిన రికార్డ్ స్థాయి విజయం గొప్ప విలువ కోసం భారతదేశపు కస్టమర్లకు గల భారీ ఉత్సాహాన్ని చూపించింది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోని అమేజాన్ వారి ప్రసిద్ధి చెందిన షాపింగ్ కార్యక్రమం బ్లాక్ ఫ్రైడేని మొదటిసారిగా Amazon.in పై భారతదేశంలోకి తీసుకువస్తున్నాం. ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, గృహోపకరణాలు, దేశ, విదేశీ బ్రాండ్స్ కు చెందిన డెకార్ లో ఆదాలు అందచేస్తున్నాం. ఇది అన్ని శ్రేణులలో కస్టమర్లకు సాటిలేని విలువ మరియు షాపింగ్ అనుభవాన్ని అందచేయడానికి మా నిబద్ధతలో మరొక మైలురాయిని సూచిస్తోంది,” సౌరభ్ శ్రీవాత్సవ, వైస్-ప్రెసిడెంట్, కాటగిరీస్, అమేజాన్ ఇండియా అన్నారు.
కస్టమర్లు హెచ్ డిఎఫ్ సి, ఇండస్ ఇండ్, బిఓబి కార్డ్ మరియు హెచ్ఎస్ బిసి బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ మరియు క్రెడిట్ ఈఎంఐతో 10% తక్షణ డిస్కౌంట్ ను పొందవచ్చు. బ్లాక్ ఫ్రైడే సేల్ కోసం, అమేజాన్ సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ను ఉపయోగించే ప్రైమ్ సభ్యులకు అన్ని కొనుగోళ్ల పైన అపరిమితంగా 5% క్యాష్ బాక్ పొందడానికి అర్హత గలదు. నాన్-ప్రైమ్ సభ్యులు 3% క్యాష్ బాక్ అందుకుంటారు. ప్రైమ్ సభ్యులు కూడా ప్రైమ్ డే సహా ప్రత్యేకమైన షాపింగ్ కార్యక్రమాలకు త్వరగా యాక్సెస్ పొందుతారు. నైక్, ఆడిడాస్, టమ్మీ హిల్ ఫిగర్, జీన్ పాల్, కాల్విన్ క్లీన్ మరియు ఇంకా ఎన్నో ప్రముఖ జీవనశైలి బ్రాండ్స్ పై ప్రముఖ డీల్స్ ఆనందించండి. ఎల్జీ, పనసోనిక్ మరియు శామ్ సంగ్ వంటి బ్రాండ్స్ లో పెద్ద ఉపకరణాల పై భారీగా ఆదా చేయండి. డాబర్, సెబామెడ్ లోషన్స్, మరియు టాటా టీ వంటి ప్రముఖ బ్రాండ్స్ గల వింటర్ స్టోర్ లో శీతాకాలం సంరక్షణ అవసరాలు మరియు స్టైలిష్ సీజనల్ ఎంపికలు పొందండి. హెచ్ డిఎఫ్ సి, ఇండస్ ఇండ్, బీఓబి మరియు హెచ్ఎస్ బిసి బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ మరియు క్రెడిట్ ఈఎంఐతో కస్టమర్లు 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.