Akshaya Tritiya: అక్షయ తృతీయ (Akshaya Tritiya) అనేది రోజు మొత్తం మంచి ముహూర్తంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మాంగలిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. అక్షయ తృతీయ సందర్భంగా స్వర్ణం, వెండి, ఆభరణాలు, వాహనాలు, ఇల్లు, దుకాణం, ప్లాట్ మొదలైనవి కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఈ రోజున బంగారం ధరలు పెరుగుతాయి. అయినప్పటికీ అక్షయ తృతీయనాడు బంగారం కొనడం ఎందుకు శుభప్రదంగా భావిస్తారు? ఈ రోజుకు ముందు కూడా బంగారం కొనవచ్చా? ఆ వివరాలను తెలుసుకుందాం.
అక్షయ తృతీయనాడు బంగారం ఎందుకు కొంటారు?
అక్షయ తృతీయను సంవత్సరంలో అత్యంత శుభప్రదమైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజు చేసే ఏ కొత్త ప్రారంభం లేదా కొనుగోలు చేసిన వస్తువు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతారు. ఈ రోజు అత్యంత ప్రాచుర్యం పొందిన కార్యకలాపం బంగారం కొనడం. అక్షయ తృతీయతో సంబంధించిన నమ్మకం ఏమిటంటే.. ఈ రోజు ధన ప్రాప్తికి ఒక మార్గమని చెబుతారు. ఈ రోజు బంగారం కొనడం వల్ల ఇంట్లో సుఖం, శాంతి, సమృద్ధి నెలకొంటుందని చెబుతారు.
ధార్మిక నమ్మకం ప్రకారం.. అక్షయ తృతీయ రోజున స్వర్ణం లేదా స్వర్ణాభరణాలు కొని ఇంటికి తెచ్చినట్లయితే, లక్ష్మీదేవి స్వయంగా ఆ ఇంట్లో ప్రవేశిస్తుందని భావిస్తారు. అలాగే ఈ రోజు కొనుగోలు చేసిన ఆస్తి లేదా ధనం శాశ్వతంగా ఉంటుందని, అందులో సమృద్ధి నిలిచి ఉంటుందని కూడా నమ్ముతారు.
అక్షయ తృతీయకు ముందు బంగారం కొనవచ్చా?
హిందూ ధర్మంలో బంగారాన్ని లక్ష్మీదేవి ప్రతీకగా భావిస్తారు. అందుకే స్వర్ణాన్ని ఏ రోజునైనా కొనవచ్చు. కానీ ఈ శుభ కార్యాన్ని అక్షయ తృతీయ రోజున చేస్తే దాని ఫలితం రెట్టింపు అవుతుంది. ఈ రోజు కొన్న బంగారం ఇంట్లో ఆస్తి, సుఖాలను పెంచుతుంది. ఈ రోజు బంగారం కొనడం వల్ల సంవత్సరం పొడవునా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రాదని చెబుతారు. పురాణ కథ ప్రకారం.. అక్షయ తృతీయ రోజునే కుబేరుడికి నిధి లభించింది.
Also Read: CSK vs SRH Head To Head: చెన్నై మీద హైదరాబాద్ గెలవగలదా? గణంకాలు ఏం చెబుతున్నాయంటే!
అక్షయ తృతీయ 2025 బంగారం కొనుగోలు ముహూర్తం
తేదీ: 30 ఏప్రిల్ 2025
బంగారం కొనడం అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన సంప్రదాయాలలో ఒకటిగా భావిస్తారు. ఈ సారి బంగారం కొనుగోలు కోసం 30 ఏప్రిల్ ఉదయం 6:11 నుండి మధ్యాహ్నం 2:12 గంటల వరకు అత్యంత శుభ సమయంగా ఉంటుంది.