రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) వినూత్నమైన టెక్నాలజీ ఉత్పత్తులను ప్రకటించింది. ఆకాశ్ అంబానీ పరిచయం చేసిన “జియో ఫ్రేమ్స్” అనే స్మార్ట్ ఐవేర్, భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన AI ఆధారిత వేరబుల్ ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తుంది. ఈ గ్లాసెస్ ద్వారా వినియోగదారులు జియో మల్టీలాంగ్వేజ్ వాయిస్ అసిస్టెంట్‌తో నేరుగా మాట్లాడవచ్చు. ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డు చేయడం, లైవ్ వెళ్లడం వంటి కార్యకలాపాలు చేతులు ఉపయోగించకుండానే సులభంగా చేయవచ్చు. తీసిన డేటా మొత్తం జియో AI క్లౌడ్‌లో భద్రపరచబడుతుంది.
Pakistan Floods : పాకిస్థాన్‌లో ప్రళయం.. భారీ వరదల వెనుక అసలు కారణం ఏంటి?
అలాగే మరో కీలక ఉత్పత్తి “జియో పీసీ”. ఇది ఏ టీవీ లేదా డిస్ప్లేను పూర్తి స్థాయి AI-రెడీ కంప్యూటర్‌గా మార్చేస్తుంది. జియో సెట్‌టాప్ బాక్స్‌కు కీబోర్డ్‌ను కనెక్ట్ చేసిన వెంటనే, జియో క్లౌడ్ ద్వారా వర్చువల్ కంప్యూటర్ సిద్ధమవుతుంది. వినియోగదారులు ఉపయోగించినంతకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ముందస్తు పెట్టుబడి అవసరం లేకపోవడం, ఎప్పటికప్పుడు సెక్యూర్ అప్‌డేట్‌లు ఉండడం, అవసరానికి అనుగుణంగా మెమరీ, స్టోరేజ్, కంప్యూటింగ్ పవర్ పెంచుకోవడం వంటి సౌకర్యాలు “జియో పీసీ” ప్రత్యేకతలు. ఇది డిజిటల్ యాక్సెస్‌ను మరింత సులభతరం చేయనుంది.
ఈ సందర్భంగా గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా కీలక ప్రకటన చేశారు. రిలయన్స్ వ్యాపార రంగాలన్నింటిలో AI వినియోగాన్ని పెంపొందించేందుకు గూగుల్–రిలయన్స్ కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జామ్నగర్‌లో ప్రత్యేకంగా గూగుల్ క్లౌడ్ రీజియన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది రిలయన్స్ క్లీన్ ఎనర్జీ, జియో అధునాతన నెట్‌వర్క్‌లు, గూగుల్ క్లౌడ్ AI శక్తిని కలిపి, వినూత్న ఆవిష్కరణలకు దోహదం చేస్తుంది. దీంతో భారతీయ టెక్నాలజీ రంగంలో కొత్త దశ మొదలయ్యే అవకాశముందని భావిస్తున్నారు.