Site icon HashtagU Telugu

Airtel – Apple : ఎయిర్‌టెల్ కస్టమర్లకు యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్ సేవలు

Airtel Apple

Airtel – Apple : యాపిల్‌తో ఎయిర్ టెల్‌ జట్టుకట్టింది. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యం వల్ల మన దేశానికి చెందిన ఎయిర్ టెల్ యూజర్లకు యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంటే ఈ ఒప్పందం వల్ల ఎయిర్ టెల్ కస్టమర్లకు హై క్వాలిటీ వీడియో కంటెంట్, మ్యూజిక్ కంటెంట్ లభ్యమవుతుంది. భారత్‌లో హైక్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకే యాపిల్‌తో ఎయిర్ టెల్ జట్టు కట్టిందని సమాచారం.

We’re now on WhatsApp. Click to Join

ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్ (Airtel – Apple) సేవలను పొందుతున్న కస్టమర్లు ఇకపై అదనంగా యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్ ఫీచర్లను కూడా ఎంజాయ్ చేయగలుగుతారని భారతీ ఎయిర్ టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ త్రిపాఠి వెల్లడించారు. దీనివల్ల తమ కస్టమర్లు విస్తారంగా మరెన్నో రకాల టీవీషోలు, మూవీలను చూడగలుగుతారని చెప్పారు. ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్ కస్టమర్లకు యాపిల్ టీవీ ప్లస్‌‌ ద్వారా మరెన్నో డ్రామా సిరీస్‌లు, కామెడీ సిరీస్‌లు,సినిమాలు, డాక్యుమెంటరీలు, ఫ్యామిలీ ఫ్రెండ్లీ షోలను చూసే అవకాశం దక్కుతుందన్నారు.

Also Read :Reliance AGM : ముకేశ్ అంబానీ వైపు 35 లక్షల మంది చూపు.. 29నే రిలయన్స్ ఏజీఎం

ఎయిర్ టెల్ ప్రీమియం వైఫై, పోస్ట్ పెయిడ్ ప్లాన్లలోనూ  యాపిల్ టీవీ ప్లస్ ఫీచర్‌ను జోడిస్తామని అమిత్ త్రిపాఠి పేర్కొన్నారు. ఎయిర్ టెల్  ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ కస్టమర్లు ప్రత్యేకంగా యాపిల్ టీవీ ప్లస్‌‌‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోకుండానే, నేరుగా దాన్ని చూసే సౌలభ్యం తమ ద్వారా లభిస్తుందని స్పష్టం చేశారు. ఎయిర్ టెల్ వింక్ ప్రీమియం సర్వీసును వాడే వారికి యాపిల్ మ్యూజిక్ ఫీచర్ ఉచితంగా లభిస్తుందన్నారు.  ఈమేరకు వివరాలతో యాపిల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఓలివర్ షూసెర్ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read :Rajasingh : గవర్నమెంట్ భూమిలోనే ఒవైసీ ఇల్లు.. కూల్చాల్సిందే : రాజాసింగ్

ఎయిర్ టెల్ ఫ్యామిలీ రీఛార్జ్ ప్యాక్

టెలికాం రంగంలో జియోతో పోటీ వల్ల ఎయిర్‌టైల్ ఇప్పటికే తన పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్లకు అనేక ఆఫర్లను అందిస్తోంది. అలాంటి ప్రత్యేక ఆఫర్లలో ఒకటి ఫ్యామిలీ రీఛార్జ్ ప్యాక్.  ఈ ప్లాన్ కింద వినియోగదారులు ఒకేసారి నాలుగు ఫోన్‌ల వరకు రీఛార్జ్ సౌకర్యాలు పొందొచ్చు. ఒక వ్యక్తి రీఛార్జ్ చేసుకుంటే ఇంట్లో నలుగురు వ్యక్తులు దీని ప్రయోజనాన్ని పొందొచ్చు.  ఎయిర్‌టైల్ పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ రీఛార్జ్ ధరలు రెండు ఉన్నాయి. అవి రూ.1,199, రూ.1,399.  ఈ రెండు ప్లాన్‌లలో అదనంగా మరో మూడు మొబైల్ నంబర్‌లను లింక్ చేయొచ్చు.